ఇజ్రాయెల్, తీవ్రవాద సంస్థ హమాస్ యుద్దం నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ ఆపరేషన్ అజయ్ కొన‌సాగుతుంది. 18 మంది నేపాల్ పౌరులతో సహా 286 మంది ప్రయాణికులతో టెల్ అవీవ్ నుంచి స్పైస్ జెట్ కు చెందిన ఐదవ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది.

ఇజ్రాయెల్(Israel), తీవ్రవాద సంస్థ హమాస్(Hamas) యుద్దం నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ ఆపరేషన్ అజయ్(Operation Ajay) కొన‌సాగుతుంది. 18 మంది నేపాల్(Nepal) పౌరులతో సహా 286 మంది ప్రయాణికులతో టెల్ అవీవ్ నుంచి స్పైస్ జెట్(Spicejet) కు చెందిన ఐదవ విమానం ఢిల్లీ విమానాశ్రయం(Delhi Airport)లో దిగింది.

ఆపరేషన్ అజయ్ కింద ఐదవ విమానంలో 18 మంది నేపాల్ జాతీయులతో సహా 286 మంది ప్రయాణికులు వచ్చారని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి(Arindam Bagchi) తెలిపారు. సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్(L Murugan) విమానాశ్రయంలో ప్రయాణీకులకు స్వాగతం పలికిన చిత్రాలను కూడా ఆయన పంచుకున్నారు.

కేరళ ప్రభుత్వం(Kerala Govt) తెలిపిన వివరాల ప్రకారం విమానంలో వచ్చిన ప్రయాణికుల్లో రాష్ట్రానికి చెందిన 22 మంది ఉన్నారు. స్పైస్‌జెట్ విమానం A340 ఆదివారం టెల్ అవీవ్‌లో ల్యాండ్ అయిన తర్వాత సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. సమస్యను సరిదిద్దడానికి విమానాన్ని జోర్డాన్‌కు తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించిన తర్వాత.. విమానం మంగళవారం టెల్ అవీవ్ నుండి ప్ర‌యాణికుల‌తో తిరిగి వచ్చింది. వాస్తవానికి ఈ విమానం సోమవారం ఉదయమే దేశ ఢిల్లీకి రావాల్సి ఉంది.

"Written By : Senior Journalist Sreedhar"

Updated On 18 Oct 2023 5:44 AM GMT
Yagnik

Yagnik

Next Story