Permit me to die : న్యాయమూర్తికి దక్కని న్యాయం..!
దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు(Sexual harassment), అత్యాచారాలు, హత్యలు, దారుణాలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా బాధితురాళ్లకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలు, మహిళలు రోడ్డు ఎక్కుతాయి. దేశంలో ఉమెన్ ప్రొటెక్ట్ సెల్‌లు(Women protect cell) ఎన్నో నెలకొల్పిన మహిళలపై ఈ దాడులు ఆగడం లేదు. మహిళకు అన్యాయం జరిగితే పోలీసులు(Police), కోర్టులను ఆశ్రయిస్తాం. కోర్టుల ద్వారా బాధితురాళ్లకి న్యాయం చేసి.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా జరిగే పోరాటాలు చూస్తున్నాం. అయితే ఇక్కడ ట్విస్ట్(Twist) ఏంటంటే.. లైంగిక వేధింపులు తాళలేక.. ఓ మహిళా జడ్జి(Women Judge).. తాను ఆత్మహత్య చేసుకుంటానని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు(CJI) లేఖ రాశారు.
దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు(Sexual harassment), అత్యాచారాలు, హత్యలు, దారుణాలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా బాధితురాళ్లకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలు, మహిళలు రోడ్డు ఎక్కుతాయి. దేశంలో ఉమెన్ ప్రొటెక్ట్ సెల్‌లు(Women protect cell) ఎన్నో నెలకొల్పిన మహిళలపై ఈ దాడులు ఆగడం లేదు. మహిళకు అన్యాయం జరిగితే పోలీసులు(Police), కోర్టులను ఆశ్రయిస్తాం. కోర్టుల ద్వారా బాధితురాళ్లకి న్యాయం చేసి.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా జరిగే పోరాటాలు చూస్తున్నాం. అయితే ఇక్కడ ట్విస్ట్(Twist) ఏంటంటే.. లైంగిక వేధింపులు తాళలేక.. ఓ మహిళా జడ్జి(Women Judge).. తాను ఆత్మహత్య చేసుకుంటానని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు(CJI) లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఈ లేఖ కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్‌కు(UP) చెందిన ఓ మహిళా న్యాయమూర్తిని లైంగికంగా ఓ సీనియర్ వేధిస్తున్నాడు. ఏడాదిన్నరగా పోరాడినా ఫలితం లేదని.. ఇక నా జీవితాన్ని గౌరవప్రదంగామ ముగించుకోవడానికి నాకు అనుమతి కావాలని సీజేఐని బండాకు చెందిన మహిళా న్యాయమూర్తి కోరింది. జిల్లా జడ్జి(District judge) సహా అతని అనుచరులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని లేఖలో(Letter) ఆమె ఆరోపించింది. నన్ను చెత్తలా తయారు చేశారు. నన్ను నేను ఒక పనికిరాని కీటకంగా భావిస్తున్నానని ఆమె లేఖలో రాసింది. లైంగిక వేధింపులపై హైకోర్టులోని(High court) ఇంటర్నల్ సెల్‌లో ఫిర్యాదు చేశానని.. దీనిపై హైకోర్టు ఓ కమిటీ నియమించారని.. అయితే ఆ కమిటీలో(Committee) సాక్షులుగా పేర్కొన్నవారు ఆ జడ్జి కింది స్థాయి అధికారులేనని.. అలాంటప్పుడు వారి బాస్‌కు వ్యతిరేకంగా ఎలా సాక్షం చెప్తారని.. ఈ విచారణ అంతా ఓ బోగస్ అని ఆమె ఆవేదిన చెందింది. విచారణ సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ జడ్జిని ట్రాన్స్‌ఫర్(Transfer) చేయాలని కోరుతూ వేసిన తన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కేవలం 8 సెకండ్లలో కొట్టివేసిందని ఆమె వాపోయారు. నాకు బతకాలని లేదు, ఏడాదిన్నరగా నన్ను రోడ్డుపై తోసివేశారు. ప్రాణంలేని, నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇక మోయడం తన వకల్ల కాదని.. ఆత్మహత్య(Suicide) ద్వారా తనకు విముక్తి కల్పించాలని రెండు పేజీలను మహిళా జడ్జి రాశారు.
మహిళా న్యాయమూర్తి లేఖపై సీజేఐ సూచనల మేరకు సుప్రీంకోర్టు(Supreme Court) సెక్రటరీ జనరల్ అతుల్ ఎం.కుర్హేకర్ అలహాబాద్(Allahabad) హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ లేఖ రాస్తూ మహిళా జడ్జి చేసిన ఫిర్యాదులపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.