ఓ మహిళా కానిస్టేబుల్‌(Woma Constable) మగవాడిగా మారేందుకు లింగ మార్పిడి చేయించుకుంది(gender reassignment). తర్వాత ఓ మహిళను వివహం చేసుకుంది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత తండ్రి కూడా అయింది. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా మజల్‌గావ్‌ తాలూకాలోని రాజేగావ్‌కు చెందిన లలితా సాల్వే(Lalitha Salve) పోలీస్‌కానిస్టేబుల్‌గా ఎంపికైంది. తనకు 25 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు శరీరంలో మార్పులను గుర్తించింది.

ఓ మహిళా కానిస్టేబుల్‌(Woma Constable) మగవాడిగా మారేందుకు లింగ మార్పిడి చేయించుకుంది(gender reassignment). తర్వాత ఓ మహిళను వివహం చేసుకుంది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత తండ్రి కూడా అయింది. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా మజల్‌గావ్‌ తాలూకాలోని రాజేగావ్‌కు చెందిన లలితా సాల్వే(Lalitha Salve) పోలీస్‌కానిస్టేబుల్‌గా ఎంపికైంది. తనకు 25 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు శరీరంలో మార్పులను గుర్తించింది. వైద్యులను సంప్రదించగా ఆమెలో వై క్రోమోజోంలు ఉన్నట్లు తేలింది. దీంతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. ఇదే విషయంపై బాంబే హైకోర్టును(Bombay High Court) మహిళా కానిస్టేబుల్‌ లలితా సాల్వే ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులపాటు సెలవు కావాలని కోరింది.

బాంబే హైకోర్టుతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతికూడా లభించడంతో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పురుషుడిలా మారాడు. 2018 నుంచి 2020 వరకు పలు సర్జరీల ద్వారా మగవాడిగా మారాడు. తన పేరును లలిత్‌కుమార్‌ సాల్వేగా(Lalith Kumar Salve) పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత 2020లో ఔరంగాబాద్‌కు చెందిన సీమను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన నాలుగేళ్లకు ఈనెల 15న ఈ జంటకు మగ బిడ్డ పుట్టాడు. దీంతో లలిత్‌ కుమార్‌ సాల్వే ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' మహిళ నుంచి మగవాడిగా నా ప్రయాణం సాగింది. ఈ క్రమంలో అనేక కష్టాలను అనుభవించానన్నాడు. ఈ విషయంలో చాలా మంది నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించారని ఆయన అన్నాడు. నా భార్య, నేను బిడ్డను కనాలని కోరుకున్నాం. బిడ్డను కన్న తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా పోయిందని.. తమ కుమారుడికి ఆరుష్‌(Arush) అనే పేరు పెడతామని తెలిపాడు.

Updated On 20 Jan 2024 6:43 AM GMT
Ehatv

Ehatv

Next Story