పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ(Anil Ambani) భార్య టీనా అంబానీ(Tina Ambani) విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసు(foreign exchange violation case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు మంగళవారం హాజరయ్యారు. గతంలో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన ఫెమా కేసులో అనిల్ అంబానీ తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

Tina Ambani
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ(Anil Ambani) భార్య టీనా అంబానీ(Tina Ambani) విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన కేసు(foreign exchange violation case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు మంగళవారం హాజరయ్యారు. గతంలో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన ఫెమా కేసులో అనిల్ అంబానీ తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఫెమా కేసు( FEMA Case)లో తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అనిల్ అంబానీ సోమవారం ముంబై(Mumbai)లోని బల్లార్డ్ ఎస్టేట్(Ballard Estate) ప్రాంతంలోని ఈడీ కార్యాలయం ముందు హాజరయ్యారు. 2020లో యెస్ బ్యాంక్ లోన్ లంచం కేసులో అనిల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావడం గమనార్హం. రూ.420 కోట్ల పన్ను ఎగవేత కేసులో గతేడాది సెప్టెంబర్‌లో బాంబే హైకోర్టు(Bombay High Court) అంబానీకి కొంత ఊరటనిచ్చింది. అనిల్ అంబానీపై ఎలాంటి శిక్షార్హమైన చర్యలు తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖను కోర్టు ఆదేశించింది.
