ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ముస్లిం జమాత్ రాష్ట్రీయ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ(Maulana Shahabuddin Razvi) బరేలవీ విజయ్‌పై ఫత్వా జారీ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ముస్లిం జమాత్ రాష్ట్రీయ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ రజ్వీ(Maulana Shahabuddin Razvi) బరేలవీ విజయ్‌పై ఫత్వా జారీ చేశారు. విజయ్ ఇస్లాం వ్యతిరేక చరిత్ర కలిగి ఉన్నారని, అందువల్ల ముస్లింలు ఆయన కార్యక్రమాలకు హాజరు కాకూడదని ఆదేశించారు. సినిమాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చేందుకు విజయ్ దళపతి(Thalapathy Vijay) ముస్లిం సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటున్నాడని మౌలానా రజ్వీ ఆరోపించారు. విజయ్ చరిత్ర చూస్తే ఆయన ముస్లిం వ్యతిరేకి అన్న విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘ది బీస్ట్’ సినిమాలో ముస్లింలను, మొత్తం ముస్లిం సమాజాన్ని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమాలో ముస్లింలను రాక్షసులు, దెయ్యాలుగా చూపించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడేమో రాజకీయాల్లోకి వచ్చి ఓట్ల కోసం ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' తరపున చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో ముస్లిం సమాజం కోసం ఇఫ్తార్ విందు (Iftar Gathering)ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ ముస్లిమ్ సోదరులతో కలిసి ప్రార్థనలు కూడా చేశారు. అయితే, ఈ విందు నిర్వహణలో లోపాలు ఉన్నాయని, విజయ్ భద్రతా సిబ్బంది ముస్లింలతో దురుసుగా ప్రవర్తించారని, ప్రజలను అవమానకరంగా చూశారని కొంతమంది ఆరోపించారు. గతంలో తన సినిమాల్లో కూడా ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా, దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వారు ప్రధానంగా ఆరోపించారు.

ehatv

ehatv

Next Story