ప్రియుడి కోసమో, ప్రియురాలి కోసమో సరిహద్దులు దాటుతున్న అపర ప్రేమికులు ఎక్కువవుతున్నారు. ఆ మధ్యన పబ్జీ గేమ్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, అది ముదిరిపోయి, విరహాన్ని భరించలేక ప్రియుడి కోసం పాకిస్తాన్‌ నుంచి నేపాల్‌కు వెళ్లి అట్నుంచి అటుగా అక్రమంగా ఇండియాకు వచ్చిన సీమా హైదర్‌(Seema Haider) ఉదంతం ఇంకా గుర్తుండే ఉంటుంది. అలాగే ఇక్కడ్నుంచి కూడా ప్రియుడి కోసం పాకిస్తాన్‌కు వెళ్లిన యువతి విషయం కూడా తెలిసిందే.

ప్రియుడి కోసమో, ప్రియురాలి కోసమో సరిహద్దులు దాటుతున్న అపర ప్రేమికులు ఎక్కువవుతున్నారు. ఆ మధ్యన పబ్జీ గేమ్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, అది ముదిరిపోయి, విరహాన్ని భరించలేక ప్రియుడి కోసం పాకిస్తాన్‌ నుంచి నేపాల్‌కు వెళ్లి అట్నుంచి అటుగా అక్రమంగా ఇండియాకు వచ్చిన సీమా హైదర్‌(Seema Haider) ఉదంతం ఇంకా గుర్తుండే ఉంటుంది. అలాగే ఇక్కడ్నుంచి కూడా ప్రియుడి కోసం పాకిస్తాన్‌కు వెళ్లిన యువతి విషయం కూడా తెలిసిందే. లేటెస్ట్‌గా అలాంటిదే మరో సంఘటన జరిగింది.

ప్రియుడి కోసం ఈసారి మరో మహిళ, ఇండియాలోకి అక్రమంగా చొరబడింది. అయితే ఈసారి వచ్చింది పాకిస్తాన్ నుంచి కాదు, బంగ్లాదేశ్‌(Bangladesh) నుంచి కావడం గమనార్హం. బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమా నూర్(Fatima Noor) అనే యువతి , తన దేశం నుంచి త్రిపురలోని ధర్మసాగర్ డివిజన్ లో ఉన్న పుల్బరీకి చేరుకుంది. అక్కడే తన ప్రియుడు నూర్ జలాల్(Noor jalal) ను కలుసుకుంది. ఇద్దరూ కలిసి రెండు వారాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఫాతిమాను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. అక్రమంగా ఇండియాలో చొరబడిన ఫాతిమాకు కోర్టు రెండు వారాల రిమాండ్‌ విధించింది. ధర్మసాగర్ కు చెందిన జలాల్, ఆయుర్వేద మందుల కోసం తరుచూ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న మౌళ్వీ బజార్(Maulvi Bazar) కు వెళుతూ ఉంటాడు. ఇది అతడికి చాలా సర్వసాధారణం. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన ఫాతిమా పరిచయమైంది. ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ ప్రేమ కూడా ముదిరి పాకానపడింది. ఎడబాటు తట్టుకోలేకపోయారు. ఈ విషయంలో ముందుగా ఫాతిమానే చొరవ చూపింది. ప్రియుడితో కలిసి భారత్‌కు వచ్చేసింది. అన్నట్టు ఫాతిమాకు ఇంతకు ముందే పెళ్లయ్యింది. నూర్‌ జలాల్‌కు కూడా పెళ్లయ్యింది. అయినప్పటికీ ఇద్దరూ కలిసి మరో ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. పోలీసులు రాగానే ప్రేమికుడు జలాల్ పరారయ్యాడు. ప్రేమికురాలు ఫాతిమా జైలుకెళ్లింది.

Updated On 28 Oct 2023 12:45 AM GMT
Ehatv

Ehatv

Next Story