కనురెప్పే కంటిని కాటేసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే(Father) కన్నకూతురు జీవితాన్ని నాశనం చేశాడు. తన బాధను తల్లితో చెప్పుకుని కన్నీళ్లు పెట్టింది. తల్లి కూడా నిస్సహాయతను వ్యక్తం చేసింది. తండ్రి ఘోర కృత్యాల నుంచి తప్పించుకోవడానికి ఆ యువతి వేసిన అడుగులు తప్పాయి. జీడిమెట్ల పోలీసుస్టేషన్‌(Jeedimetla Police Station) పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బీహార్‌కు(Bihar) చెందిన ఓ కుటుంబం బతుకుతెరువు కోసం కుత్బుల్లాపూర్‌కు వచ్చింది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దకూతురుకు 18 ఏళ్లు ఉంటాయి. తొమ్మిది తరగతి వరకు చదువుకుంది. కరోనా కారణంగా చదువు మానేసింది.

ఇంటివద్దే ఉంటున్న ఆమెను కొంత కాలంగా కన్నతండ్రే లైంగికంగా(Sexual Assualt) వేధించసాగాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తల్లికి తన గోడు చెప్పుకుందా యువతి. తండ్రిపై అసత్యాలు చెప్పకూడదని కూతురునే మందలించింది. లాస్టియర్‌ దీపావళికి ఈ కుటుంబం బీహార్‌ నుంచి నగరానికి రైలులో వస్తున్న సమయంలో అదే రాష్ట్రానికి చెందిన సంతోష్‌ అనే యువకుడు ఆ యువతికి పరిచయం అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. బడంగ్‌పేట గాంధీనగర్‌లో ఉంటున్న ఆ యువకుడి ప్రేమలో పడిపోయిందా యువతి. డిసెంబర్‌ 26వ తేదీన కలవాలని సంతోష్‌ కోరడంతో ఆ యువతి సికింద్రాబాద్‌ వెళ్లింది. ఇద్దరూ కలిసి ఎన్టీఆర్‌ గార్డెణ్‌(NTR Garden), ట్యాంక్‌బండ్‌ తిరిగారు. తర్వాత కుత్బుల్లాపూర్‌లోని ఆమె ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి వెళ్లిపోయాడు.

చెప్పకుండా బయటకు వెళ్లినందుకు తండ్రి కొడతాడనే భయంతో మళ్లీ సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్‌ తీసుకుని సంతోష్‌కు ఫోన్‌ చేసింది. అతడు తన ఇంటికి రావాలని యువతికి చెప్పాడు. రవి హెల్ప్‌ తీసుకుని అక్కడకు వెళ్లింది. వెంట వచ్చిన రవిని తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరింది. అతడు సరేనని చెప్పి ఆమెను అమీన్‌పూర్‌లోని తన గదికి తీసుకెళ్లాడు. రెండురోజులు అక్కడేఉంది. డిసెంబర్‌ 29వ తేదీన మద్యం మత్తులో రవి ఆమెపై లైంగిక దాడి చేశాడు. మరుసటిరోజు కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి సికింద్రాబాద్‌ స్టేషన్‌ రావాలని చెప్పింది. వారికి జరిగిందంతా చెప్పుకుని బోరుమంది. బుధవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. తండ్రి చేసిన అకృత్యాలను కూడా పోలీసులకు చెప్పింది. యువతి తండ్రితో పాటు రవి అనే వ్యక్తిపై అత్యాచారం(Molestation) కేసు నమోదు చేశారు పోలీసులు.

Updated On 5 Jan 2024 2:25 AM GMT
Ehatv

Ehatv

Next Story