హరిత విప్లవ పితామహుడు(MS Swaminathan), ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త(Agriculture Scientist) ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. 98 ఏళ్ల స్వామినాథన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం చెన్నైలో తుది శ్వాస(Death) విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు.

MS Swaminathan Passed Away
హరిత విప్లవ పితామహుడు(MS Swaminathan), ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త(Agriculture Scientist) ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. 98 ఏళ్ల స్వామినాథన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం చెన్నైలో తుది శ్వాస(Death) విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు. హరిత విప్లవాన్ని మొదటగా నార్మన్ బోర్లాగ్ వెలుగులోకి తీసుకురాగా.. భారతదేశంలో స్వామినాథన్ ముందుండి నడిపించారు. భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 1925, ఆగస్టు 7న స్వామినాథన్ జన్మించారు. ఆయనకు 1971లో రామన్ మెగసెసే అవార్డు లభించింది. అల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు, వరల్డ్ ఫుడ్ ప్రైజ్, టేలర్ ప్రైజ్, లాల్‌బహదూర్ శాస్త్రీ నేషనల్ అవార్డు,ఇందిరా గాంధీ ప్రైజ్ వంటికి ఎన్నో అవార్డులు ఈయన సొంతమయ్యాయి.
