కన్నబిడ్డను అత్తారింటికి పంపేటప్పుడు మెట్టినింటిలో ఎలా ఉండాలి? ఎలా నడుచుకోవాలి? వంటి విషయాలను తల్లిదండ్రులు చెప్పి పంపిస్తారు. అణుకువగా ఉండాలని, ఎవరేమన్నా ఎదురుచెప్పకుండా సర్దుకుపోవాలని సలహాలిస్తారు. ఎన్నో ఊహలతో అక్కడ అడుగుపెట్టిన కొత్త కొడలుకు అక్కడ వేధింపులు ఎదురైతే, మొగడు శారీరంగా హింసిస్తూ ఉంటే ఏం చేయాలి?

కన్నబిడ్డను అత్తారింటికి పంపేటప్పుడు మెట్టినింటిలో ఎలా ఉండాలి? ఎలా నడుచుకోవాలి? వంటి విషయాలను తల్లిదండ్రులు చెప్పి పంపిస్తారు. అణుకువగా ఉండాలని, ఎవరేమన్నా ఎదురుచెప్పకుండా సర్దుకుపోవాలని సలహాలిస్తారు. ఎన్నో ఊహలతో అక్కడ అడుగుపెట్టిన కొత్త కొడలుకు అక్కడ వేధింపులు ఎదురైతే, మొగడు శారీరంగా హింసిస్తూ ఉంటే ఏం చేయాలి? ఆ కాలంలో అయితే భరిస్తూ అలాగే ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఎదురు తిరుగుతున్నారు. తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇలా వచ్చేసిన అమ్మాయిలను ఎంతమంది తల్లిదండ్రులు అక్కున చేర్చుకుంటున్నారు? మేమున్నామన్న భరోసాను ఎంత మంది ఇస్తున్నారు? అంటే అనుమానమే! ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని కాన్పూర్‌(Kanpur)లో ఇలాంటి ఘటనే జరిగింది. అత్తింట్లో వేధింపులు భరించలేక భర్తతో విడాకులు తీసుకుందో ధీర వనిత. ఆమె చేసిన పనికి తల్లిదండ్రులు సంతోషించారు. బిడ్డను ప్రేమగా చూసుకునే ఏ తల్లిదండ్రులైనా ఇదే చేస్తారనుకోండి. పుట్టినింటికి వచ్చేస్తున్న బిడ్డను మేళతాళలతో ఊరేగింపుగా తీసుకొచ్చాడు తండ్రి. వివరాల్లోకి వెళితే అనిల్‌ కుమార్‌(Anil Kumar) అనే వ్యక్తి ఢిల్లీ(Delhi)లోని పాలెం ఎయిర్‌పోర్ట్‌(Palam Delhi Airport)లో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. 2016లో తన కూతురు ఉర్వి (36)ని ఢిల్లీకే చెందిన కంప్యూటర్‌ ఇంజనీర్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. కొన్నిరోజుల పాటు అత్తింటివాళ్లు ఉర్విని బాగానే చూసుకున్నారు. తర్వాతే తమ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. ఎప్పటికైనా మారకపోతారా అన్న ఆశతో ఉర్వి ఎదురుచూసింది. ఎనిమిదేళ్లయినా వారిలో కొంచెం కూడా మార్పు రాలేదు కానీ వేధింపులు మాత్రంపెరిగాయి. ఇక లాభం లేదనుకుని కోర్టు మెట్లు ఎక్కింది ఉర్వి. గత ఫిబ్రవరి 28వ తేదీన తీర్పు చెప్పింది న్యాయస్థానం. ఉర్వికి విడాకులు మంజూరు చేసింది. ఈ వార్త తెలియగానే ఉర్వి తండ్రి ఆమెను అత్తింటినుంచి బ్యాండ్‌ బాజాలతో, మేళ తాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చాడు. తాము తమ కూతురును పెళ్లి చేసి అత్తారింటికి ఎలా పంపామో అలాగే పుట్టింటికి తెచ్చుకున్నామని గర్వంగా చెప్పారు ఉర్వి తల్లిదండ్రులు. విడాకులతో తమ కూతురు, మనవరాలు నిరాశలో ఉండిపోకూడదని, నేటి నుంచి వాళ్లు సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించాలని ఈ విధంగా చేశామని అని అనిల్ కుమార్ తెలిపారు. ఉర్విని ఆమె తండ్రి మేళతాళాలతో తీసుకొచ్చిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అది చూసిన నెటిజన్లు అనిల్‌కుమార్‌ను మెచ్చుకుంటున్నారు. ఇంతకు ముందు జార్ఖండ్‌(Jharkhand)లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. విడాకులు తీసుకున్న తన కూతురిని ఇలాగే మేళతాళాలు, బాణసంచా సందడితో పుట్టింటికి ఆహ్వానించారు.

Updated On 1 May 2024 6:16 AM GMT
Ehatv

Ehatv

Next Story