ఇంటర్‌(Inter exams) ఫెయిలయిందని ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి(suicide) పాల్పడింది. దీంతో బాధపడిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన సంఘటన హన్మకొండ(Hanumakonda) - నడికూడ మండలం రామకృష్ణాపురం(Ramakrishnapuram) గ్రామంలో చోటు చేసుకుంది. గాజ కుమారస్వామికి(47) భార్య రమాదేవి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

ఇంటర్‌(Inter exams) ఫెయిలయిందని ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి(suicide) పాల్పడింది. దీంతో బాధపడిన తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన సంఘటన హన్మకొండ(Hanumakonda) - నడికూడ మండలం రామకృష్ణాపురం(Ramakrishnapuram) గ్రామంలో చోటు చేసుకుంది. గాజ కుమారస్వామికి(47) భార్య రమాదేవి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తన చిన్న కూతురు శ్రీవిద్య(srividya) గతేడాది హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైంది(fail). ఇటీవల సప్లమెంటరీ పరీక్షలు రాసినా పాస్ కాలేదు. దీంతో తండ్రి కూతురిని మందలించాడు. అసలే పరీక్షల్లో పాస్ కాకపోవడం, తండ్రి కోపం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై శ్రీవిద్య ఇంట్లో ఉన్న పురుగులమందు తాగింది. ఆమెను వెంటనే పరకాల ఆస్పత్రికి తరలించారు. అయితే తన వల్లే కూతురు ఆత్మహత్యకు యత్నించిందని భావించిన కుమారస్వామి పరకాలలోని ఫెర్టిలైజర్ షాపులో పురుగులమందు తీసుకుని కంఠాత్మకూర్ సమ్మక్క సారలమ్మ గద్దెల వైపు వెళ్లి మందు తాగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రామకృష్ణాపురంలో విషాదఛాయలు నెలకొన్నాయి

Updated On 7 May 2024 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story