శ్రీరాముడు(Lord Sri Rama) హిందువు(Hindhu)లకు మాత్రమే దేవుడు కాదని, అందరికి ఆయన దేవుడని జమ్ము కశ్మీర్‌(Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా(Farooq Abdullah) వ్యాఖ్యానించారు.

శ్రీరాముడు(Lord Sri Rama) హిందువు(Hindhu)లకు మాత్రమే దేవుడు కాదని, అందరికి ఆయన దేవుడని జమ్ము కశ్మీర్‌(Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా(Farooq Abdullah) వ్యాఖ్యానించారు. రాముడిని ఆరాధించడానికి మతంతో సంబంధం లేదని, ఆయనపై విశ్వాసం కనబర్చినవారందరికీ ఆయన దేవుడేనని స్పష్టం చేశారు అబ్దుల్లా. అధికారంలోకి రావడానికి బీజేపీ(BJP) రాముడి పేరును ఉపయోగించుకుంటోందని ఫరూక్‌ విమర్శించారు. కశ్మీర్‌లోని ఉధంపూర్‌(Udhampur)లో పాంథర్స్‌ పార్టీ(Jammu and Kashmir National Panthers Party) నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఫరూక్‌ అబ్దుల్లా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీరామచంద్రుడు హిందువులకు మాత్రమే దేవుడు కాదని, ముస్లింలకైనా, క్రిస్టియన్లకైనా ఆయన దేవుడేనన్నారు అబ్దుల్లా. రాముడిపై విశ్వాసం ఉన్నవారు అమెరికన్లు అయినా రష్యన్లు అయినా వారికి దేవుడేనని చెప్పారు. రాముడి పేరును పదే పదే వల్లెవేస్తున్న బీజేపీకి ఆయనపై అసలు ప్రేమ లేదని, ఆ పార్టీ ప్రేమంతా అధికారంపైనేనని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. తాము రామ భక్తులమంటూ ప్రజల దగ్గరకు వచ్చేవారు వట్టి మూర్ఖులని అబ్దుల్లా అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలను ప్రకటించే సమయానికి రామమందిరాన్ని బీజేపీ తెరపైకి తెస్తుందని, ప్రజల దృష్టిని మరల్చడానికి మందిర ఆరంభ తేదీని ప్రకటిస్తారని చెప్పారు. బీజేపీయేతర పార్టీలన్నీ సమైక్యంగానే ఉన్నాయని ఫరూక్‌ అబ్దుల్లా చెప్పారు.

Updated On 24 March 2023 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story