పంటకు కనీస మద్దతు ధరతో పాటు మరికొన్ని డిమాండ్లతో ఢిల్లీ చలో(Delhi chalo) చేపట్టిన రైతులు(Farmers) కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు. 'సమావేశంలో కేంద్ర మంత్రులు మాతో చర్చించిన విషయాలకు, మీడియాకు చెప్పిన వివరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మాతో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పారు.

పంటకు కనీస మద్దతు ధరతో పాటు మరికొన్ని డిమాండ్లతో ఢిల్లీ చలో(Delhi chalo) చేపట్టిన రైతులు(Farmers) కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు. 'సమావేశంలో కేంద్ర మంత్రులు మాతో చర్చించిన విషయాలకు, మీడియాకు చెప్పిన వివరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మాతో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పారు. పప్పు దినుసులపై ఎంఎస్‌పీ(MSP) కోసం 1.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రులు మాతో చెప్పారు. కానీ, 1.75 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల కేంద్రం ప్రతిపాదనను మేం తిరస్కరిస్తున్నాం. ఫిబ్రవరి 21వ తేదీన ఢిల్లీలో శాంతియుత ర్యాలీ చేపట్టేందుకు రైతులను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం' అని రైతు సంఘం నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్వాల్‌ అన్నారు.

Updated On 20 Feb 2024 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story