రైతులకు(Farmers) ఎద్దులతో(bulls) ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అవి చనిపోతే కుటుంబసభ్యులను కోల్పోయినట్టుగా బాధపడతారు. ఆ దుఃఖం నుంచి అంత త్వరగా బయటకు రాలేకపోతారు. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) మందసౌర్(Mandsaur) జిల్లా చెందిన ఇద్దరు రైతులు అయితే ఎద్దులలో తమ తండ్రుల చూసుకున్నారు. వాటి పట్ల ప్రేమానురాగాలను అరుదైన రీతిలో కనబర్చారు. భవానీసింగ్(Bhavani Singh), ఉల్ఫత్ సింగ్(Ulpath Singh) అనే ఇద్దరు సోదరులకు రెండు ఎద్దులు ఉన్నాయి.
రైతులకు(Farmers) ఎద్దులతో(bulls) ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అవి చనిపోతే కుటుంబసభ్యులను కోల్పోయినట్టుగా బాధపడతారు. ఆ దుఃఖం నుంచి అంత త్వరగా బయటకు రాలేకపోతారు. మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) మందసౌర్(Mandsaur) జిల్లా చెందిన ఇద్దరు రైతులు అయితే ఎద్దులలో తమ తండ్రుల చూసుకున్నారు. వాటి పట్ల ప్రేమానురాగాలను అరుదైన రీతిలో కనబర్చారు. భవానీసింగ్(Bhavani Singh), ఉల్ఫత్ సింగ్(Ulpath Singh) అనే ఇద్దరు సోదరులకు రెండు ఎద్దులు ఉన్నాయి. వాటికి మానా(Mana), శ్యామ(Shyam) అని పేర్లు పెట్టుకుని ప్రేమగా పెంచారు. పనిబంధం కంటే వాళ్ల మధ్య అనుబంధమే ఎక్కువగా ఉండింది. 30 ఏళ్లుగా సాగుతూ వచ్చిన ఆ బంధం ఆ ఎద్దుల మరణంతో తెగిపోయింది. డిసెంబర్ 16న అవి చనిపోయాయి. తండ్రి మరణిస్తే అంత్యక్రియలను(Funeral) ఎలా చేస్తారో ఈ సోదరులిద్దరూ ఆ ఎద్దులకు అన్ని రకాల కర్మలను శ్రద్ధగా చేశారు. ఎద్దుల అస్తికలకు పూజలు చేశారు. 11 రోజులకు శాస్త్రోక్తంగా గంగానదిలో(Ganga River) నిమజ్జనం చేశారు. డిసెంబర్ 26వ తేదీన మూడు వేల మందిని పిలిచి పెద్ద కర్మ నిర్వహించారు. అన్నట్టు శోక పత్రికను కూడా ముద్రించి అందిరికీ పంచారు. ఉల్ఫత్ సింగ్ కూడా చనిపోయిన తన రెండు ఎద్దులకు పిండప్రదానం చేశాడు. ఎనిమిదేళ్ల కిందట తనకు చెందిన రెండు ఎద్దులు ప్రమాదవశాత్తూ బండితో పాటు బావిలో పడిపోయాయి. దాంతో ఆ ఎద్దులు చనిపోయాయి. ఉల్ఫత్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి వాటి అస్తికలను ఆయన భద్రపరిచారు. మంచి తిథి రోజైన ఆదివారం వీటిని గంగానదిలో కలిపేందుకు ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లా సోరోన్కు తీసుకువచ్చాడు. ఎలాగైతే తండ్రికి పిండప్రదానం చేస్తామో వీటికి అలానే చేశాడు. అస్తికలను నదిలో నిమజ్జనం చేశాడు.