బులంద్‌షహర్ జిల్లాలోని గులాయోతి ప్రాంతానికి చెందిన కైతాలా గ్రామంలోని ఓ రైతు(farmer) ఇంటి నుంచి దొంగిలించబడిన బర్రె(Buffalow) ఒక సంవత్సరం తరువాత ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా దొరికింది.

బులంద్‌షహర్ జిల్లాలోని గులాయోతి ప్రాంతానికి చెందిన కైతాలా గ్రామంలోని ఓ రైతు(farmer) ఇంటి నుంచి దొంగిలించబడిన బర్రె(Buffalow) ఒక సంవత్సరం తరువాత ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా దొరికింది. మీరట్ జిల్లాలోని(Meerat) మవానా ప్రాంతంలోని ఖేరి మణిహార్ గ్రామానికి చెందిన ఒక రైతు తన గేదె ఫోటోలు, వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మకానికి పెట్టాడు. బులంద్‌షహర్ జిల్లా గులాయోతి ప్రాంతానికి చెందిన కైతాలా గ్రామానికి చెందిన రైతు మోహిత్ ఈ వివరాలను చూసి గత ఏడాది నవంబర్ 18న తన ఇంటి నుంచి దొంగిలించబడిన గేదెగా గుర్తించాడు. గేదె మొహంపై ఒక గుర్తు ఉందని, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను చూసిన మోహిత్ వెంటనే తన గేదెను గుర్తించాడు. మోహిత్‌తో పాటు ఖేరీ మణిహార్ గ్రామానికి పోలీసు బృందాన్ని పంపారు, గులాయోతి పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు, రైతు తన చెరకును డంప్ చేయడానికి చక్కెర మిల్లుకు వెళ్లాడని తెలుసుకున్న పోలీసులు షుగర్ మిల్లుకు వెళ్లే మార్గంలో రైతును అడ్డుకున్నారు. చెరకు బండిని లాగుతున్న తన దొంగిలించిన గేదెను వెంటనే మోహిత్‌ గుర్తించాడు. తాను షామ్లీ జిల్లా భూరా నుంచి గేదెను కొన్నానని తెలిపాడు. దీంతో భూరాకు ఫోన్ చేయగా తాను కూడా ఒకరి వద్ద గేదెను కొనుగోలు చేసి ఖేరీ మణిహార్ గ్రామంలోని రైతుకు విక్రయించానని భూరా చెప్పాడు. పోలీసులు గేదెను మోహిత్‌కు అప్పగించారు. నేరస్తులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story