పోటీ పరీక్షలకు(Competative Exams) ప్రిపేర్‌ అవుతున్నవారిలో ఎక్కువమంది రాజస్థాన్‌లోని(Rajasthan) కోటాకు వెళతారు. కోచింగ్‌ సెంటర్‌లకు(Coaching Centers) కోటా(Kota) హబ్‌లాంటిది! దేశం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తారు. విషాదమేమిటంటే ఇక్కడ కోచింగ్‌ తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులు బలవన్మరణాలకు(forced deaths) పాల్పడటం! ఆత్మహత్యలను(Suicides) నిలువరించడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలన్నీ విఫలమవుతున్నాయి. పరీక్షల భయం(Exam Fear), మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నారు విద్యార్థులు. లేటెస్ట్‌గా కోటాలో మరో విద్యార్థి ఉరి వేసుకుని చనిపోయాడు.

పోటీ పరీక్షలకు(Competative Exams) ప్రిపేర్‌ అవుతున్నవారిలో ఎక్కువమంది రాజస్థాన్‌లోని(Rajasthan) కోటాకు వెళతారు. కోచింగ్‌ సెంటర్‌లకు(Coaching Centers) కోటా(Kota) హబ్‌లాంటిది! దేశం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి వస్తారు. విషాదమేమిటంటే ఇక్కడ కోచింగ్‌ తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులు బలవన్మరణాలకు(forced deaths) పాల్పడటం! ఆత్మహత్యలను(Suicides) నిలువరించడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలన్నీ విఫలమవుతున్నాయి. పరీక్షల భయం(Exam Fear), మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నారు విద్యార్థులు. లేటెస్ట్‌గా కోటాలో మరో విద్యార్థి ఉరి వేసుకుని చనిపోయాడు. దీంతో కోటాలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 28కిeha tv చేరుకుంది. పశ్చిమ బెంగాల్‌కు(Bengal) చెందిన 20 ఏళ్ల ఫరీద్‌ హుస్సేన్‌(Farid Hussain) నీట్‌(NEET) పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నాడు. వక్ఫ్‌ నగర్ ప్రాంతంలో ఇతర విద్యార్థులతో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం గదిలో ఒంటరిగా ఉన్న ఫరీద్‌ హుస్సేన్‌ ఉరి వేసుకున్నాడు. బయటకు వెళ్లిన రూమ్మెట్స్‌ రాత్రి ఏడు గంటలకు గది దగ్గరకు వచ్చారు. బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి సెల్‌కు ఫోన్‌ చేశారు. ఫోన్‌ రింగవుతున్నా లిఫ్ట్‌ చేయకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చింది. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే హుస్సేన్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే మరణించినట్టు డాక్టర్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. హుస్సేన్‌ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్పారు. అతడి మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించడానికి కోటాలోని వసతి గృహాలలో, భవనాల చుట్టూ ఇనుప వలలు ఏర్పాటు చేశారు. గదులలో స్ప్రింగ్‌ కాయిల్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. బిల్డింగ్‌లపై నుంచి దూకినా ఏమీ కాకుండా ఉండేదుకు ఆవరణల్లో వలలు కడుతున్నారు.

Updated On 28 Nov 2023 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story