అతనొక మోటివేషనల్ స్పీకర్(Mational speaker). జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ప్రజలకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఇస్తుంటాడు. జనాలను ఉత్సాహపరుస్తూ లెక్చర్లు దంచుతాడు. యూట్యూబ్, ఇన్‌స్టాలో ఇతనికి మిలియన్లలో ఫాలోవర్సు ఉన్నారు. ఇల్లు చక్కదిద్ది బయట చెప్పాలనే మాటలు మాత్రం తనకు వర్తించవు అనుకున్నాడో ఏమో.. పెళ్లయిన కొద్ది గంటలకే భార్యను(Wife) హింసించాడన్న ఆరోపణలతో(Domestic Violence) కేసులు నమోదుకావడం గమనార్హం.

ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియా(Social media) ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరుగాంచిన వివేక్ బింద్రా(Vivek Bindra) తన భార్యపై గృహ హింసకు పాల్పడ్డాడని కేసు నమోదైంది. అతని భార్య యానికా సోదరుడు వైభవ్ కేత్రా ఫిర్యాదు మేరకు వివేక్ బింద్రాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లయిన కొద్ది గంటలకే తనపై గృహహింస కేసు నమోదు కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
డిసెంబర్ 6న వివేక్ బింద్రాకు యానికాతో వివాహమైంది. పెళ్లయిన కొద్ది గంటల్లోనే వీరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తొలుత తన తల్లితో బింద్రాకు వాగ్వాదం జరిగింది. ఇందులతో తల దూర్చిన యానికకు చేదు అనుభవం ఎదురైంది. యానికాను ఓ గదిలోకి తీసుకెళ్లి, అసభ్యపదజాలంతో ఆమెను దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఆమె జుట్టు పట్టుకొని లాగి మరీ దాడి చేశాడు. అంతేకాకుండా యానికా ఫోన్‌ను కూడా ధ్వంసం చేశాడు. అయితే ఈ ఆరోపణలను వివేక్ బింద్రా ఖండిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవేమనని కొట్టిపారేస్తున్నాడు.