మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌(Srinivasa Ramanujan) జయంతి నేడు. అపారమైన మేథాసంపత్తితో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత(Mathematics) శిఖరాలపై ఎగరేసిన మహనీయుడు ఆయన! 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని(Tamilnadu) ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఒక నిరుపేద కుటుంబంలో రామానుజన్‌ జన్మించారు. పన్నెండేళ్ల వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభను కనబరిచారు.

మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌(Srinivasa Ramanujan) జయంతి నేడు. అపారమైన మేథాసంపత్తితో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత(Mathematics) శిఖరాలపై ఎగరేసిన మహనీయుడు ఆయన! 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని(Tamilnadu) ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఒక నిరుపేద కుటుంబంలో రామానుజన్‌ జన్మించారు. పన్నెండేళ్ల వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభను కనబరిచారు. ఆయిలర్ సూత్రాలు(Euler's principles), త్రికోణమితికి(trigonometry) చెందిన అనేక సమస్యలను సులువుగా సాధించేవారు. కుంభకోణం గవర్నమెంటు కాలేజీలో చేరిన రామానుజన్ గణితం మీదే శ్రద్ధ చూపి మిగిలిన సబ్జెక్టులపై దృష్టి పెట్టకపోవడంతో ఎఫ్.ఎ. పరీక్ష తప్పారు. ఆ తర్వాత మద్రాస్‌లోని పచ్చయ్యప్ప కాలేజీలో చేరారు. అక్కడ గణితోపాధ్యాయునిగా ఉన్న ఎన్. రామానుజాచారి గణిత సమస్యలను కఠినమైన పద్ధతిలో పరిష్కరించి చూపుతుంటే, రామానుజన్ వాటిని తనదైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవారు. రామానుజన్ ప్రతిభను గమనించిన ప్రొఫెసర్ సింగారవేలు ముదలియార్, రామానుజన్‌తో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలను చర్చించి పరిష్కరించేవారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ వంటి విషయాలపై రామానుజన్ విశేష పరిశోధనలు చేశారు.

1903లో మద్రాసు(Madras) విశ్వవిద్యాలయంలో రామానుజన్‌కు స్కాలర్‌షిప్ వచ్చింది. లెక్కల వల్ల కొడుకుకి పిచ్చి పడుతుందేమోనని భయపడిన రామానుజన్‌ తండ్రి ఆయనకు పెళ్లి చేశారు. సంసారం గడవటం కోసం 25 రూపాయల వేతనం మీద రామానుజన్ గుమాస్తాగా చేరారు. చిత్తు కాగితాలను కూడా బహుజాగ్రత్తగా వాడుకుంటూ గణితమే లోకంగా బతికేవారు. గణితంలో ఆయన ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను చూచి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాసు విశ్వవిద్యాలయం నెలకు 75 రూపాయల ఫెలోషిప్ మంజూరు చేసింది. 1913లో మద్రాస్ పోర్ట్‌ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ వాకర్, రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా(Reasearch) సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్డి (1877-1947)కి పంపారు. ఉన్నతస్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్‌ను జి.హెచ్.హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28, 1918లో ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయునిగా, 1918 అక్టోబరులో ‘ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి’ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా రామానుజన్ చరిత్రకెక్కాడు. చివరిదశలో రామానుజన్ ‘ మ్యాజిక్ స్క్వేర్’, ‘ప్యూర్ మాథ్స్‌కు చెందిన నంబర్ థియరీ’, ‘మాక్ తీటా ఫంక్షన్స్ ’ చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధి పొందాయి. వీటి ఆధారంగా ఆధునికంగా కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రామానుజన్ నోటు పుస్తకాలపై, గణిత సిద్ధాంతాలపై రామానుజన్ ఇనిస్టిట్యూట్‌లో, అమెరికాలోని ఇలినాయిస్ యూనివర్సిటీలో నేటికీ రీసెర్చ్ జరుగుతోంది. గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణితదినోత్సవంగా ప్రకటించింది.

Updated On 22 Dec 2023 2:40 AM GMT
Ehatv

Ehatv

Next Story