మహారాష్ట్రలోని(Maharashtra) ముంబై(Mumbai) సమీపంలోని లోనావాలాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రకై(Tourism) లోనావాలాకు(Lonavala) వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
మహారాష్ట్రలోని(Maharashtra) ముంబై(Mumbai) సమీపంలోని లోనావాలాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రకై(Tourism) లోనావాలాకు(Lonavala) వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. కొట్టుకుపోయిన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. మిగిలిన ఇద్దరు సభ్యుల కోసం సోమవారం ఉదయమే శోధన కొనసాగుతుంది.
వర్షాకాలంలో విహారయాత్రకై చాలా మంది ప్రజలు ఈ జలపాతం దగ్గరకు వస్తారు. ఆదివారం కూడా బాధిత కుటుంబం ముంబైకి 80 మైళ్ల దూరంలో ఉన్న లోనావాలాకు విహారయాత్రకు వెళ్లింది. ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో డ్యామ్‌లో భారీగా నీరు చేరింది. దీంతో నీటి ప్రవాహం పెరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాలో రికార్డైంది. వైరల్ అవుతున్న వీడియోలో బాధిత కుటుంబ సభ్యులు ఒకరినొకరు పట్టుకుని బండపై నిలబడి ఉన్నారు. ఒకరి సాయంతో ఒకరు.. అందరూ కలిసి పకృతి విపత్తును తట్టుకునేందుకు ప్రయత్నించారు.
అయితే.. కొద్ది నిమిషాల వ్యవధిలోనే బలమైన నీటి అల వారిపైకి వచ్చింది. దీంతో వారందరూ నీటిలో కొట్టుకుపోయారు. ఆ సమయంలో వారు సహాయం కోసం అరవడం ప్రారంభించారు. అక్కడ ఉన్న ఇతర పర్యాటకులు కూడా సహాయం చేసేందుక ప్రయత్నించారు. కానీ నీటి ప్రవాహం చాలా బలంగా ఉంది, ఎవరూ అక్కడికి వెళ్లి వారికి సహాయం చేయలేకపోయారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు తాళ్లు, ట్రెక్కింగ్ సామగ్రితో బాధితులను రక్షించేందుకు ప్రయత్నించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులు జలపాతంలోకి జారి కింద ఉన్న రిజర్వాయర్‌లో మునిగిపోయారు. జలపాతం దిగువకు జారి నీటి ప్రవాహంలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల జలపాతం, భూసి డ్యామ్ దిగువ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఆందోళన నెలకొంది. మరో వీడియోలో వందలాది మంది డ్యామ్ ఒడ్డున కూర్చున్న దృశ్యం కనిపించింది. ఇంకొంతమంది పర్యాటకులు జలపాతం మధ్యలో ఫుడ్ స్టాల్స్‌తో పాటు జలపాతాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన చర్చ జరుగుతుంది.