ఫేక్‌ డాక్టర్లను చూశాం. ఫేక్‌ సివిల్‌ సర్వెంట్లను కూడా చూశాం! ఫేక్‌ హాస్పిటల్స్‌, ఫేక్‌ బ్యాంకుల వైనాన్ని కూడా విన్నాం

ఫేక్‌ డాక్టర్లను చూశాం. ఫేక్‌ సివిల్‌ సర్వెంట్లను కూడా చూశాం! ఫేక్‌ హాస్పిటల్స్‌, ఫేక్‌ బ్యాంకుల వైనాన్ని కూడా విన్నాం. ఇప్పుడు నకిలీ కోర్టు(Fake court), నకిలీ జడ్జి గురించి వింటున్నాం! గుజరాత్‌లోని(Gujarath) అహ్మదాబాద్‌లో( ahmedabad) నకిలీ కోర్టు గుట్టు బట్టబయలయ్యింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన మోరిస్‌ శామ్యూల్ క్రిస్టియన్‌ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా నకిలీ జడ్జిగా, లాయర్‌గా నటిస్తున్నారు. అసలైన కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నకిలీ న్యాయమూర్తిపై చర్యలు తీసుకున్నారు. బిత్తరపోయే విషయమేమిటంటే అహ్మదాబాద్‌ సివిల్‌ కోర్టు ముందే నకిలీ కోర్టు నడవడం! ఈ ఫేక్‌ జడ్జి కోట్ల రూపాయల విలువైన వివాదాస్పద భూములకు సంబంధించిన కేసులో పలు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇందులో కొన్ని ఉత్తర్వులు డీఎం కార్యాలయానికి చేరాయి. ఇందుకు సంబంధించిన ఓ కేసు అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తికి చేరడంతో ఫేక్‌ కోర్టు విషయం బయటపడింది. దాంతో రిజిస్ట్రార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.

Eha Tv

Eha Tv

Next Story