నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈసారి నీట్‌(NEET) పరీక్ష పేపర్‌ కాస్త హార్డ్‌గా ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. పరీక్ష కోసం బాగా ప్రిపేర్‌ అయినవారికి పర్వాలేదనిపించింది కానీ, ఓ మాదిరిగా ప్రిపేర్‌ అయిన వారికి మాత్రం టఫ్‌గా అనిపించింది.

నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈసారి నీట్‌(NEET) పరీక్ష పేపర్‌ కాస్త హార్డ్‌గా ఉందంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. పరీక్ష కోసం బాగా ప్రిపేర్‌ అయినవారికి పర్వాలేదనిపించింది కానీ, ఓ మాదిరిగా ప్రిపేర్‌ అయిన వారికి మాత్రం టఫ్‌గా అనిపించింది. ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్‌(BDS) వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం ‘నీట్‌’ పరీక్ష జరిగింది. తెలంగాణలో ఈసారి దరఖాస్తు చేసుకున్న వారిలో 95 శాతం మందికి పైగా పరీక్షకు హాజరయ్యారు.

కోవిడ్‌ కారణంగా లాస్టియర్ వరకు పేపర్‌ కాస్త ఈజీగానే ఉందని, ఈసారే కఠినంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. ఈసారి కటాఫ్‌ మార్క్‌ తగ్గే అవకాశం ఉందంటున్నారు. 2020లో జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్క్‌ 147 ఉండగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 113 గా ఉంది. 2021లో జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్క్‌ 138 ఉంటే , ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 108గా ఉంది.

లాస్టియర్‌ జనరల్‌ కేటగిరి కటాఫ్‌ మార్క్‌ 117 ఉంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 93గా ఉంది. ఈసారి ఎగ్జామ్‌ పేపర్‌ను బట్టి చూస్తే మాత్రం కటాఫ్‌ మార్క్‌ జనరల్‌ కేటగిరిలో 110, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో 85 ఉండే ఛాన్స్‌ ఉంది. నిన్న జరిగిన నీట్‌ పరీక్షలో కెమిస్ట్రీ పేపర్‌ చాలా హార్డ్‌గా ఉందని స్టూడెంట్స్ చెబుతున్నారు. లాస్టియర్‌తో పోలిస్తే ఫిజిక్స్‌ పేపర్‌ ఈజీగా ఉందంటున్నారు.

కాకపోతే నాలుగైదు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయన్నారు. 'ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు అప్షన్లు కరెక్ట్‌గా లేవు. బాటనీ ప్రశ్నలు సులువుగా ఉన్నా, సుదీర్ఘంగా ఉన్నాయి. చదవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాయి. స్టేట్‌­మెంట్‌ టైప్‌ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి' అని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో సీట్లు బాగా పెరిగాయి.

కాబట్టి తక్కువ మార్కులు వచ్చినా సీటు లభించే ఛాన్స్‌ ఉంది. లాస్టియర్‌ 450 మార్కులు వచ్చిన వారికి జనరల్‌ కేటగిరీలో కన్వీనర్‌ కోటాలో సీటు వచ్చింది. ఈసారి 430 మార్కులు వచ్చిన వారికి కన్వీనర్‌ కోటాలో సీటు దొరకవచ్చు. లాస్టియర్ 700 మార్కులు వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ఈసారి ఆ సంఖ్య తగ్గవచ్చు.

Updated On 7 May 2023 11:13 PM GMT
Ehatv

Ehatv

Next Story