ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల(Passport) దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఫ్రాన్స్(France), జర్మనీ(Germany), ఇటలీ(Italy), జపాన్(Japan), సింగపూర్(singapore), స్పెయిన్(Spain) నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టు ప్రపంచలోని 194 ప్రపంచ గమ్యస్థానాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉందని హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ వెల్లడించింది.

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్స్‌ ప్రకటించాయి.

ఈ జాబితాలకు భారత్‌కు 80వ స్థానం దక్కింది. భారతదేశం పాస్‌పోర్టు ఉన్నవారు వీసా లేకుండా 62 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. గత ఐదేళ్లుగా జపాన్, సింగపూర్‌లు నెం.1 స్థానంలో ఉండగా. ఈ సారి యురోపియన్‌ దేశాలు అగ్రస్థానాలను దక్కించుకున్నాయి. ఫిన్లాండ్, స్వీడన్ పాస్‌పోర్టుతో 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశాలున్నాయి. ఫిన్లాండ్, స్వీడన్‌ రెండో స్థానాన్ని దక్షిణ కొరియాతో పంచుకున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్(Ireland), నెదర్లాండ్స్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 192 విదేశాలకు వీసా రహిత ప్రయాణం చేసే అవకాశం ఉంది.

ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలతో సహా వీసా లేకుండా 62 దేశాలకు ప్రయాణించడానికి వీలున్న భారతదేశ పాస్‌పోర్ట్ 80వ స్థానంలో నిలిచింది. భారత్ తన ప్రస్తుత ర్యాంక్‌ను ఉజ్బెకిస్థాన్‌తో పంచుకుంది. భారత్‌ పొరుగు దేశమైన పాకిస్తాన్‌ 101వ స్థానంలో ఉంది.

Updated On 11 Jan 2024 2:35 AM GMT
Ehatv

Ehatv

Next Story