527 Cancer Indian Items : భారత్‌లో తయారయ్యే 527 ఆహార ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు
రాపిడ్ అలర్డ్ సిస్టమ్ ఫర్ ఫుడ్(Rapid Alert system For Food) అండ్ ఫీడ్ డేటా భారత్‌లోని ఆహార ఉత్పత్తులను పరిశీలించింది. 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య కాలంలో భారత్‌లో తయారైన 527 ఆహార పదార్థాల్లో క్యాన్సర్‌కు దారి తీసే కారకాలు ఉన్నట్లు ఆర్.ఎ.ఎస్.ఎఫ్.ఎఫ్ డేటా తెలిపింది. ఇప్పటికే భారత బ్రాండ్లు(Indian Foods) ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్(Cancer chemicals) కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ గుర్తించిందని.. హాంకాంగ్, సింగపూర్‌లో వీటిపై నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి.
రాపిడ్ అలర్డ్ సిస్టమ్ ఫర్ ఫుడ్(Rapid Alert system For Food) అండ్ ఫీడ్ డేటా భారత్‌లోని ఆహార ఉత్పత్తులను పరిశీలించింది. 2020 సెప్టెంబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య కాలంలో భారత్‌లో తయారైన 527 ఆహార పదార్థాల్లో క్యాన్సర్‌కు దారి తీసే కారకాలు ఉన్నట్లు ఆర్.ఎ.ఎస్.ఎఫ్.ఎఫ్ డేటా తెలిపింది. ఇప్పటికే భారత బ్రాండ్లు(Indian Foods) ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్(Cancer chemicals) కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ గుర్తించిందని.. హాంకాంగ్, సింగపూర్‌లో వీటిపై నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ 527 ఉత్పత్తుల్లోని 87 సరుకులను విదేశాలు తిరస్కరిచినట్లు తెలుస్తోంది. భారత్‌లోనే తయారైన హానీకర రసాయనాలను 330 ఉత్పత్తుల్లో వినియోగించినట్లు తేలింది. మిగతా ఉత్పత్తుల్లో వాడిన రసాయనాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇథిలీన్ ఆక్సైడ్ వైద్య పరికరాలపై క్రీములను చంపేందుకు, వాటిని శుభ్రం చేయడానికి వాడుతారని.. అంతేకాకుండా పురుగుమందు స్టెరిలైజింగ్ ఏజెంట్‌గా వినియోగాస్తారని తెలిపారు. ఆహార ఉత్పత్తుల్లో వాడడంతో లింఫోమా, లుకేమియా వంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తి అయిన ఇథిలీన్ గ్లైకాల్ చాలా ప్రమాదమని
రామయ్య అడ్వాన్స్‌డ్ టెస్టింగ్ ల్యాబ్స్‌లోని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న జుబిన్ జార్జ్ జోసెఫ్ తెలిపారు. ఇథిలీన్ ఆక్సైడ్ ఉప ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరిస్తూ గతంలో దీనిని దగ్గు టానిక్‌లో ఉపయోగించడం వల్ల ఆఫ్రికాలో మరణాలు కూడా సంభవించాయని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే ఇథిలీన్ ఆక్సైడ్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకున్న వ్యక్తులకు గామా కిరణాలతో చికిత్స చేయించాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థలు పరిశోధనలు జరపాలని.. ఇలాంటి హానికరమైన ఉత్పత్తుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.