గాడ్స్ ఓన్ కంట్రీ కేరళపై(Kerala) దేవుడు చిన్నచూపు చూస్తున్నాడు.
గాడ్స్ ఓన్ కంట్రీ కేరళపై(Kerala) దేవుడు చిన్నచూపు చూస్తున్నాడు. దేవభూమిపై ప్రకృత పగపట్టినట్టుగా ఉంది. ప్రకృతి విపత్తులు అక్కడ సర్వ సాధారణమయ్యాయి. భారీ వర్షాలు(Heavy rains), వరదలు(Floods), కొండ చరియలు(Land slides) విరిగిపడటం వంటి విపత్తులను ప్రతి ఏడాది ఆ రాష్ట్రం ఎదుర్కొంటూనే ఉంది. 2018లో సంభవించిన విధ్వంసక వరదల్లో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 483 మంది మరణించారు. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్(Madhav gadil) ఇలాంటి విపత్తులను ఏనాడో ఊహించారు. కేరళలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని కోరారు. పశ్చిమ కనుమలను కాపాడాలని అన్నారు. అయినా ఆయన నివేదికను ఎవరూ పట్టించుకోలేదు. ఫలితమే ప్రతీ ఏడాది సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు.
దేశంలో కేరళలోనే అధిక సంఖ్యలో కొండ చరియలు విరిగిపడే ఘటనలు చోటుచేసుకొంటున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ గతంలో పార్లమెంట్‌లో తెలిపింది. 2015-22 మధ్య 3,782 ఘటనలు చోటుచేసుకోగా, వాటిల్లో 2,239 అంటే సగానికి కంటే ఎక్కువ ఒక్క కేరళలోనే జరిగాయని తెలిపింది. మొత్తం 1,848 చదరపు కిలోమీటర్లు‘హై ల్యాండ్‌ైస్లెడ్ హజార్డ్ జోన్’గా కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ గుర్తించింది.
దేశంలో జరిగిన కొండచరియల పెను విపత్తులు
1.కేదార్‌నాథ్, ఉత్తరాఖండ్(2013)
2013 జూన్‌లో కుంభవృష్టి కారణంగా ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వరదలు పోటెత్తాయి. పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో అయిదు వేల మందికి పైగా చనిపోయారు.
2.మాలిన్, మహారాష్ట్ర(2014)
మహారాష్ట్రలోని మాలిన్ గ్రామంలో 2014లో కొండచరియలు విరిగిపడి 151 మంది మరణించారు.
3.షిల్లాంగ్, మేఘాలయ(2011)
2011లో మేఘాలయలోని షిల్లాంగ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 20 మంది మరణించారు.
4.కొట్టాయం, కేరళ(2019)
2019లో కేరళలోని కొట్టాయం జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
5.మణిపూర్(2022)
2022లో భారీ వర్షాలతో మణిపూర్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 40 మంది మరణించారు