ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని ప్రియుడే(Lover) దారుణంగా హత్య(Murder) చేశాడు. తనను దూరం పెట్టిందన్నకారణంగా ప్రాణాలు బలిగొన్నాడు ఓ ఉన్మాది. ఈ ఘటన కర్నాటకలోని(Karnataka) హాసన(Hasana) తాలుకాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక జిల్లా హాసన తాలుకా శంకరనహళ్లి గ్రామానికి చెందిన తేజస్‌(Tejas), ఆలూరు తాలుకా కవళగెరె గ్రామానికి చెందిన సుచిత్ర(Suchitra) గతంలో కొంత కాలం ప్రేమించుకున్నారు.

ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని ప్రియుడే(Lover) దారుణంగా హత్య(Murder) చేశాడు. తనను దూరం పెట్టిందన్నకారణంగా ప్రాణాలు బలిగొన్నాడు ఓ ఉన్మాది. ఈ ఘటన కర్నాటకలోని(Karnataka) హాసన(Hasana) తాలుకాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక జిల్లా హాసన తాలుకా శంకరనహళ్లి గ్రామానికి చెందిన తేజస్‌(Tejas), ఆలూరు తాలుకా కవళగెరె గ్రామానికి చెందిన సుచిత్ర(Suchitra) గతంలో కొంత కాలం ప్రేమించుకున్నారు. వీరిద్దరూ మొసళెహోసళ్లి గవర్నమెంట్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో బీఈ మెకానికల్‌ కోర్సు చదువుతున్నారు.

కాలేజ్‌లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంత కాలంపాటు సుచిత్ర, తేజస్‌లు ప్రేమించుకున్నారు. అయితే ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో తేజస్‌ను సుచిత్ర దూరం పెట్టసాగింది. దీంతో ఎన్ని సార్లు తనకు దగ్గర కావాలని ప్రయత్నించినా సుచిత్ర వినడం లేదు. అయితే మరోసారి ఫోన్‌ చేసి తనను కలవాలని కోరాడు. తన వైపు నుంచి ఏదైనా తప్పు జరిగి ఉంటే చెప్పాలని, ఇద్దరం మాట్లాడుకుందామని నమ్మించాడు. దీంతో అనుకున్న విధంగానే సుచిత్ర హాసన తాలుకా కుంతిగడ్డకు తీసుకెళ్లాడు. అక్కడ మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన తేజస్‌, సుచిత్ర గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated On 18 Nov 2023 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story