రాజస్థాన్‌లోని(Rajasthan) కోటా(Kota) నగరంలో విషాదం చోటు చేసుకుంది. చంబల్‌ రివర్‌ ఫ్రంట్‌లో(Chambal Riverfront) ప్రపంచంలోనే అతి పెద్ద గంటను(Bell) ఏర్పాటు చేస్తున్న సమయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఓ ఇంజినీరుతో(Engineer) పాటు మరో కార్మికుడు(Worker) మరణించారు. మరికొందరు గాయపడ్డారు.గాయపడిన వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. స్థానికకంగా ఈ ఘటన కలకలం రేపింది.

రాజస్థాన్‌లోని(Rajasthan) కోటా(Kota) నగరంలో విషాదం చోటు చేసుకుంది. చంబల్‌ రివర్‌ ఫ్రంట్‌లో(Chambal Riverfront) ప్రపంచంలోనే అతి పెద్ద గంటను(Bell) ఏర్పాటు చేస్తున్న సమయంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఓ ఇంజినీరుతో(Engineer) పాటు మరో కార్మికుడు(Worker) మరణించారు. మరికొందరు గాయపడ్డారు.గాయపడిన వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. స్థానికకంగా ఈ ఘటన కలకలం రేపింది. కోటా జిల్లా యంత్రాంగం, రివర్‌ ఫ్రంట్‌ అధికారులు ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. రాజస్థాన్‌లోని కోటాలోని చంబల్ నది ఒడ్డున 80 వేల కిలోల బరువున్న గంటను(8okgs Bell) ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గంటగా గుర్తింపు పొందిన దీని చప్పుడు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అయిదు వేల సంవత్సరాల వరకు నిలిచి ఉండే ఈ ంటలను రివర్‌ ఫ్రంట్‌కు తీసుకువచ్చేందుకు ఎంతో కష్టపడ్డారు. ఈ గంటలను నిర్దేశిత ప్రదేశంలో అమరుస్తున్న సమయంలో ఇంజినీర్‌ దేవేంద్ర ఆర్య, మరో కార్మికుడు 35 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో కార్మికుడు స్పాట్‌లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన దేవేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

Updated On 20 Nov 2023 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story