దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం అదనపు భద్రతా బలగాలను రప్పించారు. పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
దక్షిణ కాశ్మీర్(South Kashmir)లోని కుల్గామ్(Kulgam) జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఆర్మీ జవాన్లు(Jawans) మరణించారు. ఉగ్రవాదుల(Terrorists) ఆచూకీ కోసం అదనపు భద్రతా బలగాలను రప్పించారు. పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్(Search Operation) నిర్వహిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్(Encounter) జరిగిన ప్రాంతంలో దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు.
కుల్గామ్‌లోని హలాన్ అటవీ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు శుక్రవారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని భారత సైన్యానికి చెందిన శ్రీనగర్(Srinagar)కు చెందిన చినార్ కార్ప్స్ ఒక ట్వీట్(Tweet)లో తెలిపింది. ఈ సమయంలో.. దాగి ఉన్న ఉగ్రవాదులు కార్డన్ పటిష్టంగా ఉండటం చూసి భద్రతా దళాలపై కాల్పులు(Firing) ప్రారంభించారు.
ఇరువర్గాల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడగా.. వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరమరణం పొందిన జవాన్లను హెడ్ కానిస్టేబుల్ బాబూలాల్, కానిస్టేబుల్ వసీం అహ్మద్, సచిన్ గా గుర్తించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే సైనికుల పేర్లను సైన్యం అధికారికంగా వెల్లడించలేదు.
ఆర్మీ సీనియర్ అధికారులు, ఇతర భద్రతా బలగాలు సంఘటనా స్థలంలో మకాం వేశారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు తప్పించుకోకుండా భద్రతా వలయాన్ని కట్టుదిట్టం చేశారు.