అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన సుముహూర్తం (Ram temple Inauguration) దగ్గరపడింది. ఈ నెల 22వ తేదీన జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన(Sri Ram's Prana Prathapana) కు సంబంధించిన ఆచారాలు, నియమాలు మకర సంక్రాంతి పండుగ(Makar Sankranti festival) నుంచి అంటే ఇవాళ్టి నుంచి మొదలవుతున్నాయి. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్లొనే 11 మంది దంపతులు నేటి నుంచి 45 నియమాలు పాటించనున్నారు.

అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన సుముహూర్తం (Ram temple Inauguration) దగ్గరపడింది. ఈ నెల 22వ తేదీన జరగబోయే శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన(Sri Ram's Prana Prathapana) కు సంబంధించిన ఆచారాలు, నియమాలు మకర సంక్రాంతి పండుగ(Makar Sankranti festival) నుంచి అంటే ఇవాళ్టి నుంచి మొదలవుతున్నాయి. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్లొనే 11 మంది దంపతులు నేటి నుంచి 45 నియమాలు పాటించనున్నారు. ప్రాయశ్చిత్తం(Prayaschitta), గోదానం(Godanam), దశవిధ స్నానం(Dasavidha Bath), ప్రాయశ్చిత్త క్షౌర్యం(Prayaschitta Shauryam), పంచగవ్యప్రాశన(Panchagavyaprasana) మొదలైన నియమాలను ఈ 11 మంది దంపతులు పాటిస్తారు. ఈ నియమాలను పాటించడం ద్వారా వీరు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సక్రమరీతిలో నిర్వహించగలుగుతారని పండితులు చెబుతున్నారు. సోమవారం సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఈ దంపతులంతా మొదటి స్నానం చేసి, ఎనిమిది రోజులపాటు ఈ నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ దంపతులు ఉదయం సాయంత్రం ప్రార్థన,పూజాదికాలలో పాల్గొంటూ నిరంతరం రామనామం జపించాలి. అలాగే సాత్విక ఆహారం తీసుకోవాలి. జీవనశైలి సాత్వికంగా ఉండేలా చూసుకోవాలి.

Updated On 15 Jan 2024 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story