2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కేంద్రంలోని అధికార బీజేపీకి

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కేంద్రంలోని అధికార బీజేపీకి సుమారు రూ.1300 కోట్ల విరాళాలు అందాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి మొత్తం రూ.2120 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినవే 61 శాతంగా ఉన్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో బీజేపీ తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ.1775 కోట్ల విరాళాలు సేకరించినట్టు బీజేపీ పేర్కొంది. వడ్డీ రూపంలో 2021-22లో రూ.135 కోట్లు, 2022-23లో రూ.237 కోట్ల ఆదాయాన్ని పొందామని బీజేపీ తెలిపింది. 2022-23లో ఎన్నికలు, సాధారణ ప్రచారం కోసం చేసిన మొత్తం వ్యయంలో విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి రూ.78.2 కోట్లు చెల్లించినట్టు కూడా బీజేపీ పేర్కొంది. పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా రూ.76.5 కోట్లు అందించినట్టు పేర్కొంది. 2021-22లో ఈ మొత్తం రూ.146.4 కోట్లుగా ఉందని తెలిపింది.

కాంగ్రెస్‌కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.171 కోట్ల ఫండ్స్ అందాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విరాళాలు రూ.236 కోట్లుగా ఉండగా ఈసారి కాస్త తగ్గింది. ’సమాజ్ వాదీ పార్టీ’కి 2021-22లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.3.2 కోట్లు వచ్చాయి.

Updated On 10 Feb 2024 11:39 PM GMT
Yagnik

Yagnik

Next Story