లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌(Lok sabha Election Schedule) మరికొద్ది రోజుల్లో రాబోతున్నది. అందుకు ఎన్నికల సంఘం(Election commission) అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఇంతటి కీలక సమయంలో ఎలెక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది అనూహ్యమేమీ కాదు. ఊహించిందే! కాకపోతే ఇంత ఆకస్మికంగా జరుగుతుందని అనుకోలేదు. ఎలెక్షన్‌ కమిషనర్ అరుణ్‌ గోయల్‌(Arun Goyal) తన పదవికి రాజీనామా(Resign) చేశారు.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌(Lok sabha Election Schedule) మరికొద్ది రోజుల్లో రాబోతున్నది. అందుకు ఎన్నికల సంఘం(Election commission) అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఇంతటి కీలక సమయంలో ఎలెక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది అనూహ్యమేమీ కాదు. ఊహించిందే! కాకపోతే ఇంత ఆకస్మికంగా జరుగుతుందని అనుకోలేదు. ఎలెక్షన్‌ కమిషనర్ అరుణ్‌ గోయల్‌(Arun Goyal) తన పదవికి రాజీనామా(Resign) చేశారు. మూడేళ్ల పదవీకాలం ఉన్న ఆయన ఇంత సడన్‌గా, అది కూడా లోక్‌సభ ఎన్నికల ముందు రాజీనామా చేయడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు అని ఆయన చెబుతున్నా, తెరవెనుక ఏం జరిగి ఉంటుందో సగటు భారతీయులకు తెలియదా? బెంగాల్‌ పోలింగ్‌పై సీఈసీతో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగానే అరుణ్‌ పదవి నుంచి తప్పుకున్నారు. విభేదాలు సీఈసీతో కాదని, ప్రధాని మోదీతోనేనని ఇన్‌సైడ్‌ టాక్‌!
ఆయన రాజీనామా చేయడం వల్ల వచ్చే నష్టమేమిటి? ప్రజాస్వామ్యానికి వచ్చే ముప్పేమిటీ అన్న అనుమానం అంధభక్తులకు రావచ్చు కానీ, ఆ రాజీనామా భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాలను సూచిస్తోంది. ఈ నెల 5వ తేదీన అరుణ్‌ గోయల్‌ తన కోల్‌కతా(Kolkata) పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఢిల్లీకి వచ్చేశారు. అందుకు కారణం వంట్లో బాగోలేదని చెప్పారు. మార్చి 7వ తేదీన లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దానికి అరుణ్‌ గోయల్ హాజరయ్యారు. ఆ మరుసటి రోజున తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ప్రెసిడెంట్‌ ముర్ముకు పంపించారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్‌ భల్లాతో జరగాల్సిన సమావేశానికి కూడా అరుణ్‌ హాజరు కాలేదు. మార్చి 9వ తేదీన ప్రెసిడెంట్‌ ఆయన రాజీనామాను ఆమోదించారు.
ఇంతకు ముందు చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి వచ్చే నష్టమేమిటన్నది ఇప్పుడు తెలుసుకుందాం! ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక రాజ్యాంగబద్ద, స్వతంత్ర సంస్థ. అది దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈసీఐని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)తో పాటు ఇద్దరు కమిషనర్లు నడిపిస్తారు. సీఈసీతో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను నియమించే అధికారం కేవలం ఒక కమిటీకి ఉంటుంది. ఇందులో ప్రధాన మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఈ కమిటీ ఏకాభిప్రాయంతో సీఈసీతో పాటు కమిషనర్లను నియమిస్తారు. స్వతంత్ర భారతంలో ఇది సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. అయితే గత సంవత్సరం ఎలక్షన్‌ కమిషనర్ల నియామకానికి సంబంధించిన కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించారు. ఆ స్థానంలో కేంద్రమంత్రిని నియమించడానికి ఓ బిల్లును ప్రవేశపెట్టారు. బీజేపీకి పార్లమెంట్‌లో బలముంది కాబట్టి ఈ వివాదాస్పద బిల్లుకు సునాయాసంగా ఆమోదముద్ర పడింది. జాతీయ మీడియా దీన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు. అంధభక్తులు ఎప్పటిలాగే చప్పట్లు చరిచారు. దీంతో కొత్త చట్టం ప్రకారం ప్రధాని, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉండే కమిటీ సీఈసీతో పాటు కమిషనర్లను నియమిస్తారు. అంటే అధికార పార్టీ తమ ఇష్టానుసారం సీఈసీ, కమిషనర్లను నియమించుకునే అధికారం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ ఉన్నారు. దీనికి మరో ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఉండాలి. కాగా ఎలక్షన్ కమిషనర్ అనుప్ పాండే గత నెలలోనే పదవీ విరమణ చేశారు. తాజాగా మరో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కేవలం సీఈవో రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. కొత్తగా ఇద్దరు కమిషనర్లను నియమించుకోవడానికి ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వానికి అవకాశం ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లోపే తమకు అనుకూలమైన కమిషనర్లను నరేంద్రమోదీ ప్రభుత్వం నియమించుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడు అంగీకరించకపోయినా ప్రధాని, కేంద్ర మంత్రి ఓట్లతో కమిషనర్ల నియామకం జరిగిపోవచ్చు. ఈ నెల 15వ తేదీలోపు కొత్త కమిషనర్ల నియామకం జరగనుంది. ఇప్పుడు ఆ ఇద్దరు కమిషనర్ల స్థానంలో ఎవరు వస్తారో ఈజీగా ఊహించుకోవచ్చు. మన దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది..కాదంటారా?

Updated On 11 March 2024 12:42 AM GMT
Ehatv

Ehatv

Next Story