సార్వత్రిక ఎన్నికలకు(general elections) సమయం దగ్గరపడింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం(Election commission) దాదాపుగా పూర్తి చేసింది.
లోక్‌సభ(Loksabha), వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) నిర్వహణకు ఎన్నికల సంఘం గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నది.

General Election Schedule
సార్వత్రిక ఎన్నికలకు(general elections) సమయం దగ్గరపడింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం(Election commission) దాదాపుగా పూర్తి చేసింది.
లోక్‌సభ(Loksabha), వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) నిర్వహణకు ఎన్నికల సంఘం గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నది. మార్చి 9వ తేదీ తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మే లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్ లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందుకోసం మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ బృందం సమావేశం కానున్నట్లు తెలిసింది. జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, బలగాలపై అందులో చర్చించనున్నారు. ఆ తర్వాత మార్చి 12-13 తేదీల్లో ఈసీ బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించనుంది. లోక్‌సభతో పాటే స్థానిక అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మార్చి రెండోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం మార్చి 10వ తేదీన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23వ తేదీన ఓట్ల లెక్కంపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు.
