లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనుంది

లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించనుంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల తేదీలను కూడా ఈరోజు ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్ 16తో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 97 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించింది.

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి 400 సీట్లు, భారతీయ జనతా పార్టీ 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుండి. అన్ని ప్రధాన పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఇప్పటికే చాలా వరకూ ప్రకటించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో సీట్ల చర్చలు జరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 52 సీట్లు వచ్చాయి. గత ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించారు. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో అసెంబ్లీ కాలం జూన్‌లో వివిధ తేదీల్లో ముగుస్తున్నందున జాతీయ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నారు. భద్రతా పరిస్థితిని సమీక్షించిన తర్వాత జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గతంలో చెప్పారు.

Updated On 15 March 2024 9:15 PM GMT
Yagnik

Yagnik

Next Story