ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న‌ట్లు తెలుస్తుంది

ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న‌ట్లు తెలుస్తుంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫెడ్యూలును ఎన్నికల సంఘం ప్రకటించే అవ‌కాశం ఉంది.

హర్యానా అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 3న ముగియనుండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ నవంబర్ 26తో ముగియనుంది. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు కావ‌డం విశేషం. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ర‌ద్దు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగనుండ‌టంతో.. అక్క‌డి ఎన్నిక‌ల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం కూడా 5 జనవరి 2025తో ముగుస్తుంది.

ఇక ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం ఇటీవల జమ్మూ కాశ్మీర్, హర్యానాల‌లో సందర్శించింది, కానీ మహారాష్ట్రకు వెళ్ల‌లేదు. అయితే.. ఈ రోజు 3 గంటలకు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. దీంతో హర్యానా, జమ్మూ కాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల రణరంగానికి నేడు షెడ్యూలు విడుద‌ల చేయ‌డానికేన‌ని తెలుస్తుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story