దేశంలో దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ముందడుగు వేసింది.

దేశంలో దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ముందడుగు వేసింది. గడిచిన కొన్నేళ్లుగా ఎన్నికల కమిషన్ తీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించే అంశంపై అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. 17 గుర్తింపు పొందిన పార్టీలు దేశంలో ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే నిర్వహిచాలని కోరుతున్నాయి. గత 9, 10 ఏళ్లుగా బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఎన్నికల నిర్వహణపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కావొచ్చు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఈ రకమైన విమర్శలే వస్తున్నాయి. కొన్ని లక్షల ఓటర్లను కొత్తగా చేర్చారని, కొన్ని లక్షల ఓట్లను తీసివేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే త్వరలోనే పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒట్ల తొలగింపు ప్రక్రియను కేంద్రం చాలా ఆర్గనైజ్డ్‌గా చేస్తూందనే విమర్శలు వస్తున్నాయి. గడిచిన కొన్నిరోజులుగా మాలాంటి వారు కూడా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ మరింత మెరుగ్గా పనిచేయాలంటే ఆధార్ కార్డుతో, ఓటర్ కార్డుకు లింక్ చేయాలనే డిమాండ్ ఉంది. ఆధార్ కార్డును, ఓటర్ ఐడీ కార్డుతో లింక్ చేస్తే దొంగ ఓట్లను తీసేసే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ.
