తెలంగాణలో ఎన్నికల ప్రచారం(Telangana Election Campaign) ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్(Polling) మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు..ఆయా పార్టీలు పెద్ద ఎత్తున నగదు(Money), మద్యం(Alcohol), డ్రగ్స్(Drugs), బంగారం(Gold) లాంటి వస్తువులను ఎరగా వేస్తున్నాయి. ఎన్నికల అధికారులు(Election Officials), పోలీసులకు గుట్టలు, గుట్టలు నోట్ల కట్టలు పట్టుబడటం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు పట్టుకున్న డబ్బు, మద్యం, డ్రగ్స్, బంగారం, ఇతర వస్తువుల విలువెంతో తెలిసిస్తే కళ్లు తేలేయడం ఖాయం.

తెలంగాణలో ఎన్నికల ప్రచారం(Telangana Election Campaign) ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్(Polling) మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు..ఆయా పార్టీలు పెద్ద ఎత్తున నగదు(Money), మద్యం(Alcohol), డ్రగ్స్(Drugs), బంగారం(Gold) లాంటి వస్తువులను ఎరగా వేస్తున్నాయి. ఎన్నికల అధికారులు(Election Officials), పోలీసులకు గుట్టలు, గుట్టలు నోట్ల కట్టలు పట్టుబడటం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు పట్టుకున్న డబ్బు, మద్యం, డ్రగ్స్, బంగారం, ఇతర వస్తువుల విలువెంతో తెలిసిస్తే కళ్లు తేలేయడం ఖాయం. ఈ విషయంలో ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కంటే తెలంగాణే టాప్‎లో ఉంది. ఇప్పటి వరకు ఏకంగా రూ. 737 కోట్లు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది

ఐదు రాష్ట్రాల ఎన్నికలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు(Parliament Elections) ప్రీ ఫైనల్‎గా మారాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తికాగా.. తెలంగాణలో రేపు ఓటింగ్ రసవత్తరంగా సాగనుంది. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాలకు కలిపి లెక్కింపు(counting) జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్న పార్టీలు.. ఓటర్లను ప్రలోభపెట్టే పనిలోపడ్డాయి. నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల సంఘం లెక్కలో లేని డబ్బు, మద్యం, డ్రగ్స్, బంగారం లాంటి వస్తువులను సీజ్ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో డబ్బు, మద్యం, డ్రగ్స్, బంగారం, ఇతర వస్తువులు కోట్లల్లో పట్టుబడటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

ఇక ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 9న వచ్చినప్పటి నుంచి నేటి వరకు అత్యధికంగా ఒక్క తెలంగాణలోనే దాదాపుగా రూ. 737 కోట్లు విలువ చేసే డబ్బు, మద్యం, డ్రగ్స్, బంగారం లాంటి వస్తువులను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.301 కోట్లకుపైగా నోట్ల కట్టలున్నాయి. అక్రమ మద్యం రూ.124 కోట్లు, మత్తు పదార్థాలు విలువ రూ.39 కోట్లకుపైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే బంగారం విలువ రూ.186 కోట్లు, ఇతరత్రా వస్తువుల విలువ రూ.83 కోట్లుగా తేల్చారు.

తెలంగాణలో పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలు కావడంతో నోట్ల కట్టలు ఊహించని రీతిలో బయటపడుతున్నాయి. మద్యం ఏరులైపారుతోంది. బంగారం వంటి ఇతరత్ర వస్తువులను గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు అధికార, విపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆయా పార్టీలు రాత్రికి రాత్రే పోలింగ్ తీరును మార్చివేసే విధంగా వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ ఒక్కరోజే కీలకం కావడంతో అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున నిఘా పెట్టాయి. పోలీసులు బందోబస్తును మరింత కఠినతరం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నగదు, ఇతర వస్తువులు పట్టుబడే అవకాశం కనిపిస్తోంది.

Updated On 29 Nov 2023 2:13 AM GMT
Ehatv

Ehatv

Next Story