రేపు తెలంగాణలో పోలింగ్(Telangana Polling) ప్రశాంతంగా కొనసాగేలా ఈసీ(Election Election) అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అయితే ఓటర్లు తమ ఓటు హక్కు(Right to vote) వినియోగించుకునే ముందు ఎన్నికల రూల్స్(Election Rules) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అసలు పోలింగ్ ఎలా జరుగుతుంది.. ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అన్నది ప్రతి ఒక్క ఓటరు తెలుసుకోవాల్సిందే!

రేపు తెలంగాణలో పోలింగ్(Telangana Polling) ప్రశాంతంగా కొనసాగేలా ఈసీ(Election Election) అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అయితే ఓటర్లు తమ ఓటు హక్కు(Right to vote) వినియోగించుకునే ముందు ఎన్నికల రూల్స్(Election Rules) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అసలు పోలింగ్ ఎలా జరుగుతుంది.. ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది? అన్నది ప్రతి ఒక్క ఓటరు తెలుసుకోవాల్సిందే!

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఓటర్ల చేతిలో వజ్రాయుధం. తమకు నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటు ద్వారనే సాధ్యం. ఈ నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్క ఓటరు బాధ్యత. ఓటు వేయాలంటే పోలింగ్‌ కేంద్రం(Polling Booth) వద్ద ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలి. అందుకే ఓటు వేయబోయే ముందే ఏ పోలింగ్‌ కేంద్రంలో మీ పేరు నమోదై ఉందో తెలుసుకోవడం మంచిది. ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్(EC Website) లేదా సీవిజిల్ యాప్ ద్వారా తెలుసుకోవడం చాలా సులభం.

ప్రతి ఒక్క ఓటరూ..ఓటు వేసేముందు ఎన్నికల కమిషన్ రూల్స్ అండ్ గైడ్‎లైన్స్‎ను(Guidelines) తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు(Voter ID card) తీసుకెళ్లాలి. బూత్ లోపలికి సెల్‌ఫోన్లు(Phones) తీసుకెళ్లకూడదు. పోలింగ్‌ కేంద్రం దగ్గర పార్టీల గుర్తులు, రంగులు కలిగిన బట్టలు, టోపీల వంటివి ధరించకూడదు. పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి.

ఓటర్ లిస్ట్‌లో ఉన్న పేరు, గుర్తింపు కార్డు సరిగా ఉన్నాయో లేదో చూసి.. అధికారులు పోలింగ్ బూత్‌లోకి పంపుతారు. అక్కడ ఎడమచేతి చూపుడు వేలు(Left Index Fingure) చెక్ చేసి దానికి సిరా వేస్తారు. ఆ తర్వాత రిజిస్టర్‌లో ఓటరు వివరాలు నమోదు చేసి స్లిప్‌ రాసి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు. తర్వాత ఓటరు.. పోల్‌ చీటీ తీసుకుని కంట్రోల్‌ యూనిట్‌ దగ్గరికి వెళ్లి ఓటు వేయాలి. సీయూలో బటన్ నొక్కిన తర్వాత మీరు ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా మీ ఓటుని నిర్ధారించుకోవచ్చు.

ఓటు వేయడంలో ఏవైనా ఇబ్బందులున్నా, మీ ఓటు మరొకరు వేసినా.. వెంటనే పోలింగ్ ఆఫీసర్‌‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏ సమయంలోనైనా వెళ్లి ఓటు వేసే అవకాశం ఉంటుంది.

Updated On 29 Nov 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story