అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(Assembly Election Schedule) రేపో మాపో వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సంసిద్ధమవుతోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో భేటీ అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం సమీక్షలు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ ఓ అంచనాకు వచ్చింది.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(Assembly Election Schedule) రేపో మాపో వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సంసిద్ధమవుతోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో భేటీ అవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం సమీక్షలు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ ఓ అంచనాకు వచ్చింది. తెలంగాణ(Telangana)తో పాటు మధ్యప్రదేశ్(Madya Pradesh), రాజస్థాన్(Rajastan), చత్తీస్‌గఢ్(Chhattisgarh), మిజోరం(Mizoram) రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలన్నది ఈసీ భావన. చత్తీస్‌గఢ్లో మాత్రం రెండు విడతలలో పోలింగ్ నిర్వహించాలనుకుంటోంది. చత్తీస్‌గఢ్‌లో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువ కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. పోలీసు, జనరల్, ఎక్స్‌ఎండేజర్ పరిశీలకులతో సమావేశం కానుంది. ఇక డిసెంబర్ 10-15 తేదీల మధ్య ఓట్ల కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందిస్తున్నది.