సార్వత్రిక ఎన్నికలు(General elections) సమీపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన రాజకీయపార్టీలన్నీ ప్రచారంలో(Election Campaign) నిమగ్నమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు తమకు నచ్చిన గుర్తు వస్తుందా? రాదా? అన్న టెన్షన్‌లో పడ్డారు. అన్నట్టు ఈసారి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఎన్నికల గుర్తుల జాబితా నుంచి బుల్‌డోజర్‌(Bulldozer) గుర్తును ఎన్నికల సంఘం తొలగించింది.

సార్వత్రిక ఎన్నికలు(General elections) సమీపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన రాజకీయపార్టీలన్నీ ప్రచారంలో(Election Campaign) నిమగ్నమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు తమకు నచ్చిన గుర్తు వస్తుందా? రాదా? అన్న టెన్షన్‌లో పడ్డారు. అన్నట్టు ఈసారి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఎన్నికల గుర్తుల జాబితా నుంచి బుల్‌డోజర్‌(Bulldozer) గుర్తును ఎన్నికల సంఘం తొలగించింది. ఎందుకు తొలగించాల్సి వచ్చిందన్నది ఎన్నికల సంఘం చెప్పలేదు కానీ కారణం మాత్రం మనం ఊహించుకోవచ్చు. బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాలు బుల్‌డోజర్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నాయో మనం చూస్తున్నాం. ఇప్పుడు బుల్‌డోజర్‌ అంటే చాలు అప్రయత్నంగానే బీజేపీ గుర్తుకు వస్తున్నది. బహుశా ఆ కారణంతోనే ఎన్నికల సంఘం(Election Commission) ఈ గుర్తును తొలగించి ఉంటుంది. ఈసారి ఎన్నికల సింబల్స్‌లో కొత్త కొత్త గుర్తులు వచ్చి చేరాయి. కాస్మోటిక్స్‌, పిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు వచ్చి చేరాయి. ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన జాబితాలో మొత్తం 190 ఎన్నికల గుర్తులు ఉన్నాయి. వీటిలో బూట్లు, చెప్పులు, సాక్స్‌, బ్యాంగిల్స్‌, ముత్యాలహారం, చెవిపోగులు, ఉంగరం మొదలైనవి ఉన్నాయి. ఆపిల్‌, ఫ్రూట్‌ బాస్కెట్‌, బిస్కెట్లు, బ్రెడ్‌, కేక్‌, క్యాప్సికమ్‌, క్యాలీఫ్లవర్‌, కొబ్బరి, అల్లం, ద్రాక్ష, పచ్చి మిరపకాయ, ఐస్‌క్రీమ్‌, పనసపండు, బెండకాయ, నూడుల్స్‌, వేరుశనగ, బఠానీ వంటి ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. లేటెస్ట్‌గా ఈ జాబితాలో వాల్‌నట్‌(Wallnut), పుచ్చకాయను(Watermelon) కూడా చేర్చారు. బేబీ వాకర్, క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్, కలర్ ట్రే బ్రష్, హ్యాండ్ కార్ట్, స్కూల్ బ్యాగ్, టోఫీలు, లూడో, లంచ్ బాక్స్, పెన్ స్టాండ్, పెన్సిల్ బాక్స్, షార్పనర్‌లు కూడా ఎలెక్షన్‌ సింబల్స్ జాబితాలో ఉన్నాయి. హార్మోనియం, సితార్, ఫ్లూట్, వయోలిన్ కూడా ఉన్నాయి. ఇంతకు ముందు మనకు కనిపించే హ్యాండ్‌ మిల్లు, డోలీ, టైప్‌రైటర్‌, మంచం, బావి, టార్చ్‌, స్లేట్, టెలిఫోన్‌, రోకలి, బ్లాక్‌బోర్డు, చిమ్నీ, పెన్‌ నిబ్‌, గ్రామఫోన్‌, లెటర్‌బాక్స్‌లు ఇప్పుడు వాడుకలో లేవు. ఆధునిక పరికరాల లిస్టులో ఎయిర్‌ కండీషనర్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, మౌస్‌, కాలిక్యులేటర్‌, సీసీ కెమెరా, డ్రిల్‌ మెషిన్‌, వాక్యూమ్‌ క్లీనర్‌, పెన్‌ డ్రైవ్‌, బ్రెడ్‌ టోస్టర్‌, రిమోట్‌, స్పానర్‌, స్టెప్లర్‌, స్టెతస్కోప్‌, ఎక్స్‌టెన్షన్ బోర్డ్, మైక్ , మిక్సర్, స్విచ్ బోర్డ్, సిరంజి, ఫ్రైయింగ్ పాన్, హెడ్‌ఫోన్‌లు, హెల్మెట్, రోబోట్, రూమ్ కూలర్, హీటర్ వంటివి ఉన్నాయి. ఇక పోతే అల్మారా, ఆటో రిక్షా, బెలూన్, బ్యాట్, బెల్ట్, బెంచ్, సైకిల్ పంప్, బైనాక్యులర్స్, సెయిలింగ్ బోట్, బాక్స్, ఇటుకలు, బ్రీఫ్‌కేస్, బ్రష్, బకెట్, డీజిల్ పంప్, డిష్ యాంటెన్నా, గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ , ప్రెస్, కెటిల్, కిచెన్ సింక్, పాన్, పెట్రోల్ పంప్, ఫోన్ ఛార్జర్, ప్రెజర్ కుక్కర్, పంచింగ్ మెషిన్, కత్తెర, కుట్టు మిషన్, నీటి పాత్ర, సబ్బు డిష్, సోఫా, ఊయల, టేబుల్, టెలివిజన్, ట్యూబ్ లైట్ మొదలైన వాటిలో నచ్చిన గుర్తును ఎంపిక చేసుకోవచ్చు.

Updated On 11 April 2024 2:45 AM GMT
Ehatv

Ehatv

Next Story