ELection commission : ఏపీలో పథకాల లబ్ధిదారులకు నిధుల విడుదల
ఏపీలో పథకాల నిధుల(Subsidy Money) విడుదలకు ఈసీ(ELections Commission) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ పేరుతో పథకాల లబ్దిదారులకు నిధుల విడుదలను ఆపిన ఈసీ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో నిధులు విడుదలకు ఓకే చెప్పింది. ఈ మేరకు లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి(Jawahar Reddy) ఆదేశాలు జరీ చేసింది ఆసరా పథకానికి రూ.1,480, జగనన్న విద్యాదీవెన కింద రూ.502 కోట్లు తొలుత విడుదల చేశారు
ఏపీలో పథకాల నిధుల(Subsidy Money) విడుదలకు ఈసీ(ELections Commission) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ పేరుతో పథకాల లబ్దిదారులకు నిధుల విడుదలను ఆపిన ఈసీ ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో నిధులు విడుదలకు ఓకే చెప్పింది. ఈ మేరకు లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి(Jawahar Reddy) ఆదేశాలు జరీ చేసింది ఆసరా పథకానికి రూ.1,480, జగనన్న విద్యాదీవెన కింద రూ.502 కోట్లు తొలుత విడుదల చేశారు. మిగిలిన పథకాల లబ్దిదారులకు రెండు, మూడు రోజుల్లో ఖాతాల్లో డబ్బు జమచేస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల ముందు నిధుల విడుదలకు అంతా సిద్ధం చేసినా టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలింగ్ ముందుకు డీబీటీ కింద ఫండ్స్ విడుదల కాలేదు. దీంతో కొందరు లబ్దిదారులు కోర్టును ఆశ్రయించారు. నిధులను విడుదల చేయాలని కోర్టు ఆదేశించినా అందుకు ఈసీ సమ్మతించలేదు. లబ్ధిదారులకు ప్రతి ఏడాది ఇచ్చినట్లే నిధుల విడుదల చేయవచ్చని ఆదేశించింది. అంతేకాకుండా ఈనెల 10లోగా ఈసీ తన వైఖరిని వెల్లడించాలని ఆదేశించినా ఈసీ కాలయాపన చేసింది. ఈసీ తీరుపై మరోసారి లబ్దిదారులు కోర్టును ఆశ్రయించగా కోర్టు ఈసీపై మండిపడింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈలోగా ఎన్నికలు రానే వచ్చాయి, మే 13న ఎన్నికలు ముగిసిన తర్వాత ఎట్టకేలకు నిధుల విడుదలకు అనుమతి ఇవ్వడంతో ఆసరా, ఫీజురీఎంబర్స్‌మెంట్ పథకాలకు ఫండ్స్ విడుదల చేశారు. మిగిలిన పథకాలకు కూడా త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు.