సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌పై(General Election Schedule) నెలకొన్న సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెర దించింది. శనివారం, మార్చి 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు లోక్‌సభ ఎన్నికల(Lok Sabha) షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రెస్‌మీట్‌(Pressmeet) ఉంటుందని పేర్కొంది.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌పై(General Election Schedule) నెలకొన్న సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెర దించింది. శనివారం, మార్చి 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు లోక్‌సభ ఎన్నికల(Lok Sabha) షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రెస్‌మీట్‌(Pressmeet) ఉంటుందని పేర్కొంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh), సిక్కిం(Sikkim), ఒడిశా(Odisha), అరుణాచల్‌ప్రదేశ్‌(Arunchal Pradesh) రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్‌ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16వ తేదీతో, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్‌ 24వ తేదీతో ముగియనున్నాయి.
శుక్రవారం ఉదయం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్‌ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన తేదీపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated On 15 March 2024 4:13 AM GMT
Ehatv

Ehatv

Next Story