Election Code : ఎన్నికల కోడ్ వచ్చేస్తోంది...!
మరికొద్ది గంటల్లో లోక్‌సభ ఎన్నికలతో(Lok sabha Election) పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), అరుణాచల్‌ప్రదేశ్(Arunachal Pradesh), ఒడిశా(Odisha), సిక్కిం(Sikkim) రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్(ELection schedule) విడుదల కాబోతున్నది.

Election Code
మరికొద్ది గంటల్లో లోక్‌సభ ఎన్నికలతో(Lok sabha Election) పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), అరుణాచల్‌ప్రదేశ్(Arunachal Pradesh), ఒడిశా(Odisha), సిక్కిం(Sikkim) రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్(ELection schedule) విడుదల కాబోతున్నది. ఆ వెంటనే ఎన్నికల కోడ్(Elcetion code) అమల్లోకి రాబోతున్నది. కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆఫీసులలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ఫోటోలను తొలగించాల్సి ఉంటుంది. అలాగే కోడ్ అమలులోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఉన్న రాజకీయనేతల పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాజకీయపరమైన హోర్డింగులు, పోస్టర్లు, గోడరాతలు తొలగించాలని చెప్పింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రోడ్లు, బస్సులు, విద్యుత్ స్థంభాల పైన ప్రకటనలు తొలగించాలని సీఈవో పేర్కొంది. ఇక, ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనలు కూడా నిలిపివేయాల్సి వస్తుంది. కోడ్ అమల్లోకి రాగానే అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోటోలను తొలగించాలి.. కోడ్ అమల్లోకి రాగానే మంత్రులకు ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం నిలిపేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల ప్రక్రియలో ఉన్న అధికారులు, అధికార యంత్రాంగం బదిలీలపై పూర్తి నిషేధం అమలు అవుతుంది. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు పైలట్ కార్లు, సైరన్ వినియోగించకూడదు. ప్రభుత్వ గెస్ట్ హౌసులను మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఖాళీ చేయాల్సి ఉంటుంది.
