దేశంలో ఎన్నికల సైరన్‌ మోగింది. లోక్‌సభ ఎన్నికలతో(Lok sabha Elections) పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను(Assembly Elections Schedule) కేంద్ర ఎన్నికల సంఘం(ELection Commission) ప్రకటించింది. ఢిల్లీలో విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌(Rajiv Kumar) షెడ్యూల్‌ను ప్రకటించారు. జూన్‌ 16వ తేదీతో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని, ఆలోపు సార్వత్రిక ఎన్నికలకు(General Elections) ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు.

దేశంలో ఎన్నికల సైరన్‌ మోగింది. లోక్‌సభ ఎన్నికలతో(Lok sabha Elections) పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను(Assembly Elections Schedule) కేంద్ర ఎన్నికల సంఘం(ELection Commission) ప్రకటించింది. ఢిల్లీలో విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌(Rajiv Kumar) షెడ్యూల్‌ను ప్రకటించారు. జూన్‌ 16వ తేదీతో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని, ఆలోపు సార్వత్రిక ఎన్నికలకు(General Elections) ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరుగుతుందని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఏప్రిల్‌ 19 తేదీన తొలి దశ పోలింగ్‌ ఉంటుందని, ఏప్రిల్‌ 26 తేదీన రెండో దశ, మూడో దశలో మే 7వ తేదీన, మే 13న నాలుగో దశలో, మే 20వ తేదీన అయిదో దశ పోలింగ్‌, మే 25వ తేదీన ఆరో దశ, జూన్‌1వ తేదీన ఏడో దశ పోలింగ్‌ ఉంటుందని చెప్పారు. శనివారం నుంచి జూన్‌ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండనుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల తేదీలను ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభకు మే 13 వ తేదీనే పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా అదే రోజు జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

Updated On 16 March 2024 7:23 AM GMT
Ehatv

Ehatv

Next Story