మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్(Jharkhand) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) తేదీలను భారత ఎన్నికల సంఘం(Election commission) ప్రకటించింది.
మహారాష్ట్ర(Maharashtra), జార్ఖండ్(Jharkhand) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) తేదీలను భారత ఎన్నికల సంఘం(Election commission) ప్రకటించింది. మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. అక్టోబర్ 22న నోటిఫికేషన్ వస్తుందని, నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 29వ తేదీ అని, అక్టోబర్ 30వ తేదీన స్క్రూటినీ జరుపుతామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 4వ తేదీ చివరి రోజున్నారు. నవంబర్ 20వ తేదీన ఎన్నకలు జరుగుతాయని, నవంబర్ 23వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయని ఆయన చెప్పారు. జార్ఖండ్ విషయానికి వస్తే అక్టోబర్ 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 25వ తేదీ చివరి రోజు. అక్టోబర్ 28వ తేదీన స్క్రూటనీ జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 10వ తేదీ చివరి రోజు. నవంబర్ 13వ తేదీ, నవంబర్ 20వ తేదీలలో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 23వ తేదీన ఫలితాలు వస్తాయి.