దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్ల ఓట్లు. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది.

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్ల ఓట్లు. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్‌ ఓటర్లున్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో బుధవారం ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 96.88 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఆ సంఖ్య ఈ ఏడాదికి వచ్చే సరికి భారీగా పెరిగింది. మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18-29 ఏళ్ల మధ్య వయసున్న యువత ఉన్నారు. 2024తో పోలిస్తే 2025లో స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తిలో తేడా కూడా తగ్గిపోయింది. 2024 లో ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా.. 2025 నాటికి అది 954కు పెరిగింది. మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లకు చేరుకుంది.

ehatv

ehatv

Next Story