అక్కడ ఒక కుటుంబం కోసమే ప్రత్యేకంగా ఓ పోలింగ్‌ బూత్‌ను(Polling Booth) ఏర్పాటు చేశారు. అలాగని అదేమీ రాజకుటుంబం కాదు...అపర కుబేరుల ఫ్యామిలీ అంతకంటే కాదు. అయినా 35 మంది ఉన్న ఆ కుటుంబం కోసం ఎన్నికల సంఘం(Election Commission) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాజస్థాన్‌లోని(Rajasthan) మారుమూల గ్రామంలో ఈ అతి చిన్న పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. భారత్‌(India)-పాకిస్తాన్‌(Pakistan) సరిహద్దు ప్రాంతమైన బార్మల్‌(Burmal) జిల్లాలో బాద్మేర్‌ కా పార్‌ అనే చిన్ని గ్రామం ఉంది.

అక్కడ ఒక కుటుంబం కోసమే ప్రత్యేకంగా ఓ పోలింగ్‌ బూత్‌ను(Polling Booth) ఏర్పాటు చేశారు. అలాగని అదేమీ రాజకుటుంబం కాదు...అపర కుబేరుల ఫ్యామిలీ అంతకంటే కాదు. అయినా 35 మంది ఉన్న ఆ కుటుంబం కోసం ఎన్నికల సంఘం(Election Commission) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాజస్థాన్‌లోని(Rajasthan) మారుమూల గ్రామంలో ఈ అతి చిన్న పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. భారత్‌(India)-పాకిస్తాన్‌(Pakistan) సరిహద్దు ప్రాంతమైన బార్మల్‌(Burmal) జిల్లాలో బాద్మేర్‌ కా పార్‌ అనే చిన్ని గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒకే ఒక్క కుటుంబం నివసిస్తున్నది. ఆ కుటుంబంలో 35 మంది సభ్యులు ఉన్నారు. అంటే గ్రామ జనాభా కూడా అంతేనన్నమాట! వీరిలో 18 మంది పురుషులు, 17 మంది మహిళలు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి వీరికి చాలా కష్టమయ్యేది. ఓటు వేయడానికి సుమారు 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. అది కూడా అత కష్టం మీద కాలి నడకన ..లేకపోతే ఒంటెలపై .. అంతే తప్ప మరో రవాణా మార్గంలేదు. అందుకే మగవాళ్లు మాత్రమే ఓటు వేసి వచ్చేశారు. మహిళలు, వృద్ధులు ఓటింగ్‌కు దూరంగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. బాద్మేర్‌ కా పార్‌ గ్రామస్థుల కోసం ప్రత్యేకంగా ఓ పోలింగ్‌ బూత్‌నే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇది తెలిసి ఆ ఫ్యామిలీ ఆనందపడుతోంది. ఈసారి ఓటు వేసేందుకు మహిళలు, వృద్ధులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

Updated On 10 Nov 2023 6:03 AM GMT
Ehatv

Ehatv

Next Story