Election commission : లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడో తెలుసా.. క్లారిటీ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్
లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరుగనున్నాయి. కాగా.. ఏప్రిల్ 16 నుంచి లోక్‌సభ ఎన్నికలు అంటూ సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతుంది. దీంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వివిధ ఎన్నికల సంబంధిత అధికారులను ఉద్దేశించి, 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతాయని లేఖలో తెలిపారు.
లోక్‌సభ ఎన్నికలకు(Lok Sabha Elections) కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) జరుగనున్నాయి. కాగా.. ఏప్రిల్ 16 నుంచి లోక్‌సభ ఎన్నికలు అంటూ సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతుంది. దీంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వివిధ ఎన్నికల సంబంధిత అధికారులను ఉద్దేశించి, 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతాయని లేఖలో తెలిపారు. ఈ వైరల్ నోటిఫికేషన్‌లో.. ఈ తేదీని దృష్టిలో ఉంచుకుని ఇతర విషయాలను ప్లాన్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా.. తాజాగా ఎన్నికల సంఘం(Election Commission) ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. 2024 ఏప్రిల్ 16న లోక్‌సభ ఎన్నికలు అంటూ తాము ఇచ్చిన తేదీ తాత్కాలికేమనని వెల్లడించింది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలను పూర్తి చేసేందుకు ఆ తేదీని ఓ లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించింది. ఆ తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు సంబంధిత వర్గాలకు ఈ నెల 19న అధికారిక లేఖను జారీ చేశామని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. మరోవైపు.. ఎన్నికల తేదీలపై కూడా చర్చలు జరుపుతున్నారని.. సరైన సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటిస్తుందని సీఈవో కార్యాలయం తెలిపింది. ఈ క్లారిటీతో ఎన్నికల తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు తెరపడుతుందని కమిషన్ ఆశాభావం వ్యక్తం చేసింది.