తెలంగాణతో(Telangana) పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ఈ రోజుల విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం(Press Meet) నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించవచ్చు.
తెలంగాణతో(Telangana) పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ఈ రోజుల విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం(Press Meet) నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించవచ్చు. ఎన్నికల కమిషన్(Election Commission) చీఫ్ రాజీవ్‌కుమార్(Rajiv Kumar) ప్రెస్‌మీట్‌లో వివరాలను వెల్లడించనున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరంలలో ఎన్నికలు(Elections 2023) జరగాల్సి ఉంది. ఈ అయిదు రాష్ట్రాలలో నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ మొదటి వారంలోపు ఎన్నికలు జరగవచ్చని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లలో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. చత్తీస్‌గఢ్లో మాత్రం రెండు విడతల్లో పోలింఘ్ నిర్వహించనున్నారట. మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17నే ముగియనుండగా.. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువులు 2024 జనవరిలో(January) వేరు వేరు తేదీల్లో ముగుస్తాయి.