ఏప్రిల్ 19 ఉదయం 7.00 గంటల నుండి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల మధ్య లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం

Election Commission bans exit polls from April 19 to June 1
ఏప్రిల్ 19 ఉదయం 7.00 గంటల నుండి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల మధ్య లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం లేదా ప్రచారం చేయడం నిషేధిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఓపీనియన్ పోల్ లేదా పోల్ సర్వే ఫలితాలతో సహా ఎన్నికల విషయాలను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించరాదని గురువారం జారీ చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
