Pawan Kalyan Tweet : జనసేనకు మళ్లీ గాజు గ్లాసు గుర్తు కేటాయింపు.. పవన్ కృతజ్ఞతలు
జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) మరోసారి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు(Glass) గుర్తును తొలగించింది. అయితే తాజాగా మళ్లీ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది.

Pawan Kalyan Tweet
జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) మరోసారి గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు(Glass) గుర్తును తొలగించింది. అయితే తాజాగా మళ్లీ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. దీంతో ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు’’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాస్. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" ను మరోసారి కేటాయించిన ఎన్నికల సంఘం. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం - జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం అని మరో ట్వీట్ చేశారు.
గతంలో.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన పార్టీ తన గాజు గ్లాస్ గుర్తును కోల్పోయింది. అప్పుడు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ చేసింది. తాజాగా ఆ గుర్తును మరోమారు కేటాయించడంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
