మన సంప్రదాయ దుస్తులైన ధోతీ ధరించాడన్న కార‌ణంతో బెంగళూరులో ఓ వృద్ధుడిని షాపింగ్ మాల్‌లోకి ప్రవేశం నిరాకరించారు

మన సంప్రదాయ దుస్తులైన ధోతీ ధరించాడన్న కార‌ణంతో బెంగళూరులో ఓ వృద్ధుడిని షాపింగ్ మాల్‌లోకి ప్రవేశం నిరాకరించారు. GT మాల్‌లో భద్రతా సిబ్బంది ఓ యువకుడిని, అతడి తండ్రిని లోపలికి రానివ్వలేదు. వారికి జరిగిన అవమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళవారం సాయంత్రం సినిమా కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, మాల్ ప్రవేశద్వారం వద్ద భద్రతా సిబ్బంది తండ్రీకొడుకులను ఆపేసింది. ధోతీలు ధరించిన వ్యక్తులకు మాల్ లో ప్రవేశం నిషేధమంటూ భద్రతా సిబ్బంది చెప్పారని ఆ యువకుడు వాపోయాడు.

ఆ యువకుడి తండ్రి విజ్ఞప్తి చేసినప్పటికీ మాల్ సిబ్బంది పట్టించుకోలేదు. వారు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చిందని, బట్టలు మార్చుకోలేకపోయామని వివరించినా కూడా మాల్ సూపర్‌వైజర్ కనీసం పట్టించుకోలేదు. ఆ వ్యక్తిని ప్యాంట్‌ మార్చుకుని లోపలికి వెళ్లాలని భద్రతా సిబ్బంది కోరింది. దీనిపై పలువురు ప్రముఖులు, నెటిజన్లు స్పందించారు. రైతులు ఇక ఎలాంటి బట్టలు ధరిస్తారంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై జీటీ మాల్ సిబ్బంది ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Eha Tv

Eha Tv

Next Story