మహారాష్ట్ర(Maharashtra) మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion) జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే(aditya thackeray) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై(Eknath Shinde) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP) షిండేను సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు సంచలనానికి తెరలేపారు.

Aditya Thackeray sensational
మహారాష్ట్ర(Maharashtra) మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion) జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray) కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే(aditya thackeray) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై(Eknath Shinde) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP) షిండేను సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు సంచలనానికి తెరలేపారు. అజిత్ పవార్(Ajit Pawar), మరో ఎనిమిది మంది ఎన్‌సిపి ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రివర్గంలో చేరడంతో సీఎం కుర్చీకి ముప్పు ఏర్పడవచ్చని ఆయన అన్నారు. అజిత్ పవార్ ప్రస్తుతం షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
ఆదిత్య ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. “ముఖ్యమంత్రి (Eknath Shinde)ని రాజీనామా చేయమని కోరినట్లు నేను విన్నాను. ఎన్‌సీపీ రెబల్ అజిత్ పవార్.. అతని మద్దతుదారులు ప్రభుత్వంలో చేరారు. బీజేపీ ఏకనాథ్ షిండే గ్రూపును పక్కన పెట్టిందని వ్యాఖ్యానించారు.
ఎన్‌సీపీ(NCP) నేత అజిత్ పవార్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరిన తర్వాత షిండే వర్గానికి చెందిన దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని ఆయన అన్నారు. ఈ విషయమై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. “అజిత్ పవార్, ఇతర ఎన్‌సిపి నాయకులు ప్రభుత్వంలో చేరిన తర్వాత.. షిండే శిబిరానికి చెందిన 17-18 మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని సంప్రదించారని పేర్కొన్నారు.
అయితే.. తాను రాజీనామా చేసే ఆలోచన లేదని, ఎన్‌సిపి రెబల్స్ విషయంలో శివసేనలో తిరుగుబాటు లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే చెప్పారు. శివసేన నాయకుడు ఉదయ్ సమంత్ మాట్లాడుతూ.. “మేము రాజీనామా చేయబోవడం లేదు. నిన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఏకనాథ్ షిండేపై విశ్వాసం వ్యక్తం చేశారు.. ఇదంతా ఏక్నాథ్ షిండే పరువు తీసేందుకే చేస్తున్నారని ఖండించారు.
